Site icon NTV Telugu

Sree Leela : అవమానించిన శ్రీ లీల ..వీడియో రిలీజ్ చేసిన నటుడు

Mahesh Achanta Sree Leela

Mahesh Achanta Sree Leela

శ్రీలీల, పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ సినిమా ఉగాది సందర్భంగా మార్చి 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో, నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అయితే, ఈ ఈవెంట్‌లో శ్రీలీలకు చెందిన ఒక వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో శ్రీలీల వెనుక జబర్దస్త్ మహేష్ నిలబడి ఉన్నాడు. శ్రీలీల వెనక్కి చూసిన క్రమంలో, తనను చూస్తుందనుకొని మహేష్ ఆమె వంక చూస్తూ చిరునవ్వులు చిందించాడు. అయితే ఆమె మాత్రం అతన్ని ఏమాత్రం పట్టించుకోకుండా సీరియస్‌గా చూస్తూ ముందుకు తిరిగింది.

Also Read:Chinmayi: పవన్ కళ్యాణ్’ను కూడా వదలని చిన్మయి

దీంతో మహేష్‌ను అవమానించింది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున శ్రీలీల మీద ట్రోలింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో, అదే వీడియో రిలీజ్ చేసిన ఆచంట మహేష్ సోషల్ మీడియాలో అసలు ఏం జరిగిందో చెప్పుకొచ్చాడు. “శ్రీలీల గారు అంతకుముందు ఆవిడ ఫోన్ నాకు ఇచ్చారు పట్టుకోమని. ఆ తర్వాత ఆవిడ వెనక్కి చూస్తే, నా వైపు ఫోన్ కోసం చూస్తున్నారు అనుకున్నా. కానీ ఈలోపు ఆవిడ పైకి స్క్రీన్ వైపు చూశారు. అంతే జరిగింది, ఇక్కడ ఎవరు ఎవరిని అగౌరవపరచలేదు” అని మహేష్ వివరణ ఇచ్చాడు.

Exit mobile version