Site icon NTV Telugu

Jabardasth Fiama: షాకింగ్.. హాస్పిటల్ లో చేరిన ఫైమా.. ?

Faima

Faima

Jabardasth Fiama: జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఫేమస్ అయిన కమెడియన్స్ లో ఫైమా ఒకరు. పటాస్ లాంటి షోతో కెరీర్ ను స్టార్ట్ చేసి.. జబర్దస్త్ లో లేడీ కంటెస్టెంట్ గా వచ్చి.. అతికొద్ది సమయంలోనే తనదైన కామెడీ పంచస్ తో అభిమానులను మెప్పించి.. స్కిట్ లో ఫైమా లేకపోతే చూడలేం అనేలా పేరు తెచ్చుకుంది. ఇక ఆ పేరుతోనే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి కంటెస్టెంట్ గా మంచి పోటీ ఇచ్చి బయటకు వచ్చింది. ఇక షో లో ఉన్నప్పుడే జబర్దస్త్ ప్రవీణ్ తో ప్రేమాయణం మొదలుపెట్టిన ఫైమా.. అతనినే పెళ్లి చేసుకుంటానని కూడా చెప్పింది. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాకా.. వీరిద్దరి మధ్య విబేధాలు మొదలయ్యాయని, అంతకు ముందున్న ఫైమా కాదని ప్రవీణ్ ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చాడు.

ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక ఫైమా .. ఒక పక్క షోస్.. ఇంకోపక్క జబర్దస్త్ చేస్తూ బిజీగా ఉన్న ఫైమా సడెన్ గా ఆసుపత్రిపాలు అయ్యింది. తన సోషల్ మీడియాలో ఆమె హాస్పిటల్ బెడ్ పై సెలైన్ పెట్టుకొని ఉన్న వీడియోను షేర్ చేస్తూ.. నా గతమంతా నే మరిచానే అంటూ రాసుకొచ్చింది. అయితే ఆమె హాస్పిటల్ లో ఎందుకు చేరింది అనేది మాత్రం చెప్పలేదు. ఇక అందుతున్న సమాచారం ప్రకారం .. ఫైమా వైరల్ ఫీవర్ తో బాధపడుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని అంటున్నారు. ఈ వీడియో చూసిన అభిమానులు అసలు ఏమైంది అక్కా.. అని కొందరు, త్వరగా కోలుకోవాలి అని ఇంకొందరు కామెంట్స్ పెడుతున్నారు.

Exit mobile version