NTV Telugu Site icon

Chalaki Chanti: చలాకీ చంటికి గుండెపోటు.. పరిస్థితి విషమం

Chanti

Chanti

Chalaki Chanti: జబర్దస్త్ లో యాటిట్యూడ్ కా బాప్ అనిపించుకున్న నటుడు చలాకీ చంటి. తనకు నచ్చని విషయాన్ని నిర్మొహమాటంగా చెప్పుకొచ్చేస్తాడు. ఎదురు ఉన్నది ఎవరు..? ఎంతవారు అనేది అస్సులు పట్టించుకోడు. అయినా అతడంటే అందరికి ఇష్టమే. జబర్దస్త్ లో ఎన్నోసార్లు బయటికి వెళ్లి వచ్చిన నటుడు ఎవరైనా ఉన్నారు అంటే అది చలాకీ చంటి మాత్రమే. ఇక గతేడాది బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి వచ్చిన చంటికి అవకాశాలు తండోపతండాలుగా వస్తాయి అనుకున్నారు. కానీ, బిగ్ బాస్ తరువాత చంటి అసలు కనిపించిందే లేదు. అడపాదడపా షోస్ లలో మెరిసిన చంటి.. బుల్లితెరపై కూడా కనిపించడం మానేశాడు. దీనికి కారణం చంటి ఆరోగ్య పరిస్థితి అని టాక్ నడుస్తోంది.

Custody: ఈ ఒక్క సాంగ్ తో మూవీ కలర్ మారిపోయింది…

గత కొన్నిరోజులుగా చంటి ఆరోగ్యం అస్సలు బాగోలేదని, గుండె సంబంధిత సమస్యతో పోరాడుతున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే నేటి ఉదయం చంటికి గుండెపోటు వచ్చిందట. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్పించినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం చంటి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపినట్లు సమాచారం అందుతుంది. కాగా, ప్రస్తుతం చంటి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. ఇకపోతే చంటి అనారోగ్యం గురించి తెలుసుకున్న జబర్దస్త్ నటులు.. హాస్పిటల్ కు వెళ్లి పరామర్శించినట్లు సమాచారం. 2016 లో చంటికి వివాహమైంది. వారికి ఒక పాప కూడా ఉంది. ఈ విషయం తెలియడంతో అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

Show comments