NTV Telugu Site icon

Sudigali Sudheer: ‘జబర్దస్త్’ కెవ్వు కార్తీక్ పెళ్లి.. ట్రెండ్ అవుతున్న సుధీర్

Karthik

Karthik

Sudigali Sudheer: జబర్దస్త్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే సుడిగాలి సుధీర్. ఇక సుడిగాలి సుధీర్ కు యాంకర్ రష్మీ కు పెళ్లి కానున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ప్రేమలో మునిగితేలుతున్న ఈ జంట మాత్రం పెళ్లి కబురు మాత్రం చెప్పడం లేదు. ఇక జబర్దస్త్ లో ఉన్న మిగతా బ్యాచిలర్స్ అందరు ఒక్కొక్కరిగా పెళ్లి పీటలు ఎక్కిస్తున్నారు. తాజాగా కెవ్వు కార్తీక్ సైతం పెళ్లి రెడీ అయిపోయాడు. తాజాగా సోషల్ మీడియాలో తనకు కాబోయే భార్యను పరిచయం చేశాడు. ఆమె ముఖం చూపించకుండా.. ” మా జీవితంలోకి కొత్త వ్యక్తి వస్తే ఎంత హ్యాపీగా ఉంటుందని అందరు చెప్తూ ఉంటారు. బహుశా ఆ ఆనందం ఇదేనేమో.. నా జీవితంలోకి అడుగుపెడుతున్నందుకు థాంక్యూ. కొత్త జీవితాన్ని మొదలుపెడదాం” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
Swayambhu: నిఖిల్ భయ్యా.. కొంచెం గ్యాప్ ఇవ్వవయ్య్యా

ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు కెవ్వు కార్తీక్ కు శుభాకాంక్షలు చెప్తూనే సుధీర్ పెళ్లి గురించి ఆరాలు తీస్తున్నారు. జబర్దస్త్ లో ఉన్నవారందరి పెళ్లిళ్లు అవుతున్నాయి. సుధీర్ అన్న నీ పెళ్లి ఎప్పుడు అంటూ అడుగుతున్నారు. అంతేనా సుధీర్ అన్న పెళ్లి ఎప్పుడు అంటూ ట్రెండ్ చేస్తున్నారు కూడా. ఇక ఈ మధ్యనే సుధీర్ కొత్త సినిమా సెట్స్ మీదకు వెళ్ళింది. కోలీవుడ్ హీరోయిన్ దివ్యభారతి ఈ సినిమాలో సుధీర్ సరసన నటిస్తోంది. ప్రస్తుతం కెరీర్ మీద ఫోకస్ పెడుతున్న సుధీర్ ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకొనే ఉద్దేశ్యం లేదని తెలుస్తోంది. మరి ముందు ముందు సుధీర్ ఏమైనా గుడ్ న్యూస్ చెప్తాడేమో చూడాలి.

Show comments