NTV Telugu Site icon

Jabardasth Avinash: హీరోగా మరో జబర్దస్త్ కమెడియన్.. డైరెక్టర్ ఎవరంటే?

Jabardasth Avinash

Jabardasth Avinash

Jabardasth Avinash debuting as Hero: డెక్కన్ డ్రీమ్ వర్క్స్ బ్యానర్ పై నబీషేక్ నిర్మాణంలో ప్రొడక్షన్ నెం 3 గా రూపొందనున్న ‘ప్రీ వెడ్డింగ్ ప్రసాద్’ ఈ రోజు పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభమైంది. ‘జబర్‌దస్త్’, బిగ్ బాస్ షోల తో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న అవినాష్ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నట్టు సినిమా యూనిట్ వెల్లడించింది. గతంలో కొన్ని సినిమాలకు రచయితగా వ్యవహరించిన రాకేష్ దుబాసి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయి కుమార్ మరో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు కోదండ రామిరెడ్డి క్లాప్ నివ్వగా కోన వెంకట్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, కోదండ రామిరెడ్డి, కోన వెంకట్, సాయి కుమార్ మేకర్స్ కి స్క్రిప్ట్ అందించారు.

Ram Charan: చిరంజీవి నటజీవితానికి 45 ఏళ్ళు.. మెగా పవర్ స్టార్ ఎమోషనల్ పోస్ట్

దర్శకుడు రాకేష్ దుబాసి ముహూర్తపు సన్నివేశానికి స్వయంగా దర్శకత్వం వహించగా దర్శకుడు సాయి రాజేష్ సినిమా టైటిల్ లోగో లాంచ్ చేశారు. దర్శకుడు వీరభద్రం చౌదరి, నిర్మాత బెక్కం వేణుగోపాల్ తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో అవినాష్ మాట్లాడుతూ.. నబిషేక్ గారికి జీవితాంతం రుణపడి ఉంటానని, జబర్‌దస్త్, బిగ్ బాస్ షోలలో బుల్లితెర ప్రేక్షకులు నన్ను సపోర్ట్ చేశారని అన్నారు. నబిషేక్ గారు నన్ను నమ్మి ఇంత పెద్ద అవకాశం ఇచ్చారు, ‘ప్రీవెడ్డింగ్ ప్రసాద్’ టైటిల్ చెప్పగానే చాలా మంది నవ్వుకున్నారు. సినిమా చూసి కూడా నవ్వుకుంటారు, భయపడతారు, థ్రిల్ అవుతారు ఇలా అన్ని డిఫరెంట్ షేడ్స్ ఇందులో వున్నాయని అన్నారు. ఈ సినిమా మీ అందరినీ అలరిస్తుందనే నమ్మకం ఉందని మీ సపోర్ట్ కావాలని కోరారు.

Show comments