NTV Telugu Site icon

Jabardasth apparao: బ్రతికి ఉండగానే చంపొద్దు.. ఇంత దిగజారాలా?

Jabardasth Apparao Emotiona

Jabardasth Apparao Emotiona

Jabardasth Apparao Emotional Comments: ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా విరివిగా అందుబాటులోకి వచ్చాక అన్ని విషయాలు క్షణాల్లో తెలిసి పోతున్నాయి. మరీ ముఖ్యంగా వార్తల విషయం అయితే అందరికంటే తామే ముందు వార్త ఇవ్వాలి అనే తొందరలో ఒకోసారి ఆసుపత్రిలో ఉన్న సెలబ్రిటీలను కూడా చంపేస్తున్నారు. తాజాగా అలంటి ఘటనలు అనేకం చోటు చేసుకోగా ఈ విషయం మీద జబర్దస్త్ అప్పారావు ఎమోషనల్ అయ్యారు. యూట్యూబ్‌ ఛానళ్ల ద్వారా సినీ నటులు ఎదుర్కొంటున్న మానసిక క్షోభ గురించి చెబుతూ అప్పారావు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎమోషనల్‌ అయ్యారు. యూట్యూబ్‌ వాళ్లందరూ తన మాటలు వినాలని ఈ అంశం మీద నేనొక నాటిక రాద్దాం అనుకున్నానాని అన్నారు.
Kiara Advani : లోదుస్తులు లేకుండా కియారా అద్వానీ హాట్ ట్రీట్..
’యూట్యూబూ నీకో దండం’ పేరుతో నాటకం రాసుకుందామని ఇది తాను కొంచెం బాధతో చెబుతున్నానని అన్నారు. ఈ యూట్యూబ్ వాళ్ళు సుప్రసిద్ధ నటీనటులు బతికి ఉండగానే చంపేస్తున్నారని థంబ్‌ నైల్స్ ఇలా పెడితేనే చూస్తారు అనే దాంట్లో ఉంటే దయచేసి నమస్కారం అని అన్నారు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పండని ఆయన అన్నారు. సోషల్‌ మీడియా ఇప్పుడు బలంగా ఉంది, నో డౌట్‌, నేను అంగీకరిస్తాను కానీ మనిషి బతికుండగా చనిపోయాడు అని చెప్పే అధికారం మీకు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. నేను నేరుగా మాట్లాడుతున్నానని పేర్కొన్న అయన ఎవరైనా చనిపోవాల్సిందేనని అన్నారు. ఆయా వార్తలు రాసిన వారు కూడా చనిపోవాల్సిందేనని అన్నారు. అయితే ఆ లింక్‌ ఓపెన్‌ చేయడానికి దారుణమైన కాప్చన్స్‌ పెట్టకండి, లేనిపోని వన్నీ పెట్టేసి మమ్మల్ని మానసిక క్షోభకు గురి చేయకండి, సినీ పరిశ్రమలో ఉన్న పెద్దవారి అందరి తరపునా కోరుకుంటున్నానని అన్నారు.