Jabardasth Dhanraj: జబర్దస్త్ ఎంతోమంది కమెడియన్స్ ను పరిచయం చేసింది. అంత మంచి ప్లాట్ ఫామ్ నుంచి వచ్చిన నటులు .. తమదైన రీతిలో వెండితెరపై దూసుకుపోతున్నారు. ఇప్పటికే సుడిగాలి సుధీర్ హీరోగా.. గెటప్ శ్రీను, చమ్మక్ చంద్ర కమెడియన్స్ గా దూసుకుపోతుండగా.. వేణు డైరెక్టర్ గా మారి.. హిట్ అందుకున్నాడు. ఇక వేణు బాటలోనే ధనరాజ్ కూడా డైరెక్టర్ గా మారాడు. స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్ పై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వి పొలవరపు నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 1 గా తెరకెక్కుతున్న ద్విభాష చిత్రానికి ధనరాజ్ మొదటిసారి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో మరో డైరెక్టర్ సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. నేడు ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. ఈ చిత్ర పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగాయి.
Director Hari: సింగం డైరెక్టర్ ఇంట తీవ్ర విషాదం
నటుడు శివబాలాజీ క్లాప్ కొత్తగా, సోలో బతుకే సో బెటర్ డైరెక్టర్ సుబ్బు కెమెరా స్విచ్ఛాన్ చేశాడు. ఇక ఫస్ట్ షాట్ డైరెక్షన్ బలగం వేణు చేశాడు. అలాగే అమిగోస్ డైరెక్టర్ రాజేంద్ర తెలుగు స్క్రిప్ట్ అందజేయగా, డియర్ కామ్రేడ్ డైరెక్టర్ భరత్ కమ్మ తమిళ్ స్క్రిప్ట్ ను యూనిట్ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర, తాగుబోతు రమేష్, మధు నందన్, ఖయుమ్, భూపాల్, పృద్వి, రాకెట్ రాఘవ తదితరులు పాల్గొన్నారు. తండ్రి కొడుకులుగా సముద్రఖని , ధనరాజ్ నటిస్తున్న ఈ సినిమాలో మోక్ష, హరీష్ ఉత్తమన్, పృద్వి, అజయ్ ఘోష్, లావణ్య రెడ్డి, చిత్రం శ్రీను, ప్రమోదిని, రాకెట్ రాఘవ తదితరులు నటిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 9నుండి ప్రారంభం కానుంది. విమానం చిత్ర దర్శకుడు శివ ప్రసాద్ యానాల ఈ సినిమాకు కథ మాటలు సమకూరుస్తూన్నారు. ఎవరూ టచ్ చెయ్యని ఒక తండ్రి కొడుకుల ఎమోషన్ తో ఈ సినిమా తెరకెక్కబోతోంది. మరి ఈ సినిమాతో ధనరాజ్ డైరెక్టర్ గా హిట్ అందుకుంటాడా లేదా చూడాలి.