Site icon NTV Telugu

Rachha Ravi: జబర్దస్త్ నటుడు రచ్చ రవి ఆరోగ్య పరిస్థితి విషమమంటూ వార్తలు.. క్లారిటీ ఇదే

Ravi

Ravi

Rachha Ravi: సోషల్ మీడియా వచ్చాక రూమర్స్ మరింత వేగంగా వ్యాపిస్తున్నాయి. ముఖ్యంగా కొన్నిరోజులు నటీనటులు సోషల్ మీడియాలో కనిపించకపోవడం ఆలస్యం వారు చనిపోయారు అంటూ చెప్పుకొచ్చేస్తున్నారు. ఇలా చాలామంది సీనియర్ నటులను సోషల్ మీడియా చంపేసింది. ఆ తరువాత వారే మీడియా ముందుకు వచ్చి మేము చనిపోలేదు బాబోయ్ అని చెప్పుకొనే దుస్థితి వచ్చింది. ఇక తాజాగా జబర్దస్త్ నటుడు రచ్చ రవికి ప్రమాదం జరిగిందని, ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందంటూ వార్తలు వస్తున్నాయి. ఇక ఈ వార్తలు వైరల్ అవ్వడంతో రవి క్లారిటీ ఇచ్చాడు. తనకు ఎటువంటి ప్రమాదం జరగలేదని, తాను బాగానే ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. ఈ మధ్యనే పూణెలో షూటింగ్ ఉంటే వెళ్లి వచ్చినట్లు తెలిపిన రవి.. ఇంటికి క్షేమంగా చేరుకున్నట్లు తెలిపాడు.

Unstoppable 2 : పవన్ ప్రోమో వచ్చేసిందిరోయ్..

అభిమానులు తనపై చూపిస్తున్న ప్రేమకు ధన్యుడను అని, పలు సినిమాలతో బిజీగా ఉన్నట్టు చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఇలాంటి రూమర్స్ ను నమ్మవద్దని చెప్పిన రచ్చ రవి.. వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్ లో కూడా పాల్గొంటానని చెప్పుకొచ్చాడు. దీంతో ఈ రూమర్స్ కు చెక్ పడినట్లు అయ్యింది. జబర్దస్త్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన నటుల్లో రచ్చ రవి కూడా ఉన్నాడు. చమ్మక్ చంద్ర స్కిట్స్ లో కంటెస్టెంట్ గా చేసిన రవి.. ఆ తరువాత రచ్చ రవి టీం కు లీడర్ గా మారాడు. నాగబాబు జడ్జిగా ఉన్నప్పుడు మంచి ఫార్మ్ లో ఉన్న అతను.. ఆయన వెళ్ళిపోగానే ఆయనతో పాటే వెళ్ళిపోయాడు. ఇక సినిమాల్లో మంచి మంచి పాత్రలతో మెప్పిస్తున్న రచ్చ రవి కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకుంటున్నాడు.

Exit mobile version