NTV Telugu Site icon

Sunny Deol: ‘జాత్’ మూవీ గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

Jaath

Jaath

బాలీవుడ్‌ స్టార్‌ హీరో సన్నీడియోల్‌ మన తెలుగు దర్శకుడు గోపీంచద్‌ మలినేని దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘జాత్’. అనే టైటిల్‌ను నిర్ణయించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ అండ్‌ పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు నిర్మిస్తున్న ఈ మూవీకి నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, టీజీ విశ్వప్రసాద్‌ నిర్మాతలుగా వ్యావహరిస్తున్నారు. రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్, సయామి ఖేర్, రెజీనా కసాండ్రా కీలక పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Also Read: Kethika : సమంత, శ్రీలీల బాటలో మరో హీరోయిన్

ఇక ఇప్పటికే ఫస్ట్‌లుక్‌ విడుదల కాగా సన్నిడియోల్‌‌ను పవర్‌ఫుల్‌ యాక్షన్‌, ఇంటెన్స్‌ అవతార్‌లో ప్రజెంట్‌ చేశాడు గోపీంచద్‌ . పూర్తి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈచిత్రం రూపొందుతుందని నిర్మాతలు హింట్‌ ఇచ్చారు. సన్నిడియోల్‌ తన శరీరమంతా బ్లడ్‌ మార్క్స్‌తో భారీ ఫ్యాన్‌ని పట్టుకుని ఉండటం ఈ పోస్టర్‌లో గమనించివచ్చు. కాగా ఈ పోస్టర్‌ చూస్తుంటే హై ఆక్టేన్‌ డ్రామా, లార్జర్‌ దేన్‌ లైఫ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ సినిమాగా ఉండబోతుందని అంటున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. అయితే తాజాగా మైత్రీ మూవీ మేకర్స్‌ ‘జాత్’ మూవీ గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. మార్చి 10న ఉదయం 10.35 గంటలకు క్యారెక్టర్ గ్లింప్స్ రివీల్ చేస్తున్నట్లు, ఇంట్రెస్టింగ్ పోస్టర్ తో అధికారికంగా ప్రకటించారు.