గత ఆరున్నరేళ్లుగా బాక్సాఫీస్ ఆకలితో ఉన్నారు ప్రభాస్ ఫ్యాన్స్. 2017 సంవత్సరంలో బాహుబలి2తో బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించిన ప్రభాస్… ఈ ఆరున్నరేళ్ల కాలంలో ఒక్క హిట్ కూడా కొట్టలేదు. బాహుబలి తర్వాత ప్రభాస్‌కు ఒక్క హిట్ పడితే చూడాలని ఎదురు చూస్తునే ఉన్నారు రెబల్ స్టార్ అభిమానులు కానీ సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలేవి కూడా ఫ్యాన్స్‌ను అలరించలేకపోయాయి. అయినా రోజు రోజుకి ప్రభాస్ క్రేజ్ పెరుగుతునే ఉంది. అందుకు నిదర్శనమే లేటెస్ట్ సలార్ బుకింగ్స్ అని చెప్పొచ్చు. ఆఫ్‌లైన్లో టికెట్స్ ఓపెన్ చేస్తే థియేటర్ల ముందు బాహుబలి2 సీన్ చూపించారు. ఆన్‌లైన్లో బుకింగ్స్ ఓపెన్ చేస్తే యాప్స్ క్రాష్ అయ్యేలా చేశారు. ఈ లెక్కన సలార్ పై ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ అంతా ఏ రేంజ్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ఎట్టకేలకు చాలా వాయిదాల తర్వాత భారీ ఎత్తున థియేటర్లోకి రాబోతోంది సలార్ పార్ట్ వన్ సీజ్ ఫైర్.
ఇప్పటికే బుకింగ్స్ ఫైర్ మోడ్‌లో జరిగాయి. నెక్స్ట్ ఓపెనింగ్స్ లెక్కలు తేల్చడమే ట్రేడ్ వర్గాల పని. ప్రశాంత్ నీల్-ప్రభాస్ కాంబినేషన్లో ఇండియాస్ బిగ్గెస్ట్ కమర్షియల్ డ్రామాగా ఇంకొన్ని గంటల్లో ఆడియెన్స్ ముందుకి రాబోతోంది సలార్. ఈ మచ్ అవైటెడ్ సినిమా ప్రీమియర్స్ ఈరోజు దాదాపు అన్ని సెంటర్స్‌లో పడనున్నాయి. ఓవర్సీస్‌లో సలార్ ఫస్ట్ ప్రీమియర్ పడనుంది, తెలుగులో అర్ధరాత్రి 1కి సలార్ ఫస్ట్ షో పడనుంది. సుర్యూడు పూర్తిగా బయటకి వచ్చే లోపు సలార్ టాక్ వరల్డ్ వైడ్ స్ప్రెడ్ అవ్వనుంది. టికెట్స్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్, మూవీ లవర్స్… థియేటర్స్, బుక్ మై షో ఓపెన్ చేసి హడావుడి చేస్తున్నారు. సలార్‌కు జస్ట్ హిట్ టాక్ పడితే చాలు… బాహుబలి రికార్డ్స్‌ను టార్గెట్ చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు.
