Site icon NTV Telugu

Varun Tej Lavanya: మెగా ప్రిన్స్ పెళ్లి సందడి… సొట్టబుగ్గల హీరోయిన్ తోనే

Varun Tej Lavanya

Varun Tej Lavanya

మెగా హీరో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ప్రేమాయణం నడుపుతున్నారనే వార్తలు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. నిహారిక కొణిదెల పెళ్లి సమయంలో లావణ్య త్రిపాఠి కనిపించినప్పటి నుంచి ఈ ప్రేమ వార్త మరింతగా వినిపించడం మొదలయ్యింది. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలు ప్రేమలో ఉన్నారు అనే వార్త రోజు రోజుకి ఎక్కువగా వినిపించడం మొదలయ్యింది. ఈ రూమర్ పైన మెగా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ వరుణ్ తేజ్ స్పందించలేదు కానీ ఒకటి రెండు సార్లు లావణ్య త్రిపాఠి మాత్రం మా ఇద్దరి మధ్య అలాంటిది లేదు… మేము ఫ్రెండ్స్ మాత్రమే అంటూ రూమర్స్ కు చెక్ పెట్టింది. అయితే ఇన్ని రోజులు రూమర్ గా ఉన్న ఈ వార్తని నిజం చేస్తూ అఫీషియల్ ఒక అనౌన్స్మెంట్ వచ్చేసింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, తన రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ లావణ్య త్రిపాఠిలు జూన్ 9న ఎంగేజ్మెంట్ చేసుకోనున్నారు.

మరో ఇరవై నాలుగు గంటల్లో ఇప్పటివరకూ రూమర్ గా విన్న ఒక వార్త నిజం కాబోతుంది. ఇరు వర్గాల కుంటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ నిశ్చితార్ధ వేడుక జరగనుంది. ఇకపోతే వరుణ్-లావణ్య జంటగా మిస్టర్ మూవీ చేశారు. దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన ఈ మూవీ అంచనాలు అందుకోలేదు.. ప్రస్తుతం లావణ్య చేతిలో ఒక్క తెలుగు ప్రాజెక్ట్ లేదు. ఇటీవల లావణ్య పులి మేక టైటిల్ తో ఓ వెబ్ సిరీస్ చేశారు. ఇది కూడా సక్సెస్ కాలేదు. ఇక వరుణ్ తేజ్ ప్రవీణ్ సత్తారు తెరకెక్కిస్తున్న గాండీవధారి అర్జున చిత్రంలో నటిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ ఆగస్టు 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version