Site icon NTV Telugu

“అంటే సుందరానికి” షూటింగ్ పూర్తి

Ante-Sundaraniki

‘శ్యామ్ సింగ రాయ్’ సక్సెస్‌తో దూసుకుపోతున్న నాని ఇప్పుడు ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్ “అంటే సుందరానికి” అనే సినిమాలో కనిపించనున్నాడు. నిన్నటితో ఈ సినిమా షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయింది. ఈ వార్తను పంచుకుంటూ నాని ట్వీట్ చేశాడు. “ఈ సంవత్సరం రోలర్ కోస్టర్ చిత్రానికి ఇది ముగింపు… #అంటే సుందరానికి” అంటూ నాని షేర్ చేసిన వీడియోలో చిత్రబృందం మొత్తం సంతోషంగా కన్పిస్తోంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా ప్రొడక్షన్ ఫార్మాలిటీస్‌ను ముగించినందుకు మొత్తం టీమ్ థ్రిల్‌గా ఉన్నట్టు వీడియోను చూస్తే అర్థమవుతోంది.

Read Also : ‘పుష్ప’ మేనియా.. తగ్గేదే లేదంటున్న బంగ్లా క్రికెట‌ర్‌..

న్యూ ఇయర్ సందర్భంగా విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ కథానాయికగా నటించింది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో నాని నవ్వించే పాత్రలో నటిస్తున్నాడు. “అంటే సుందరానికి” ఈ ఏడాది వేసవిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Exit mobile version