త్రినాధ్ కటారి హీరోగా ఆయన స్వీయ దర్శకత్వంలో సంజీవని ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత బళ్లారి శంకర్ నిర్మిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ఇట్లు మీ ఎదవ. సాహితీ అవంచ హీరోయిన్ గా నటిస్తున్నారు. వెయేళ్ళు ధర్మంగా వర్ధిల్లు అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్, సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు.
Also Read :Himanta Sarma: కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ ఒక పాకిస్తాన్ ఏజెంట్..
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో, దర్శకుడు త్రినాధ్ కటారి మాట్లాడుతూ మేము ఒక మంచి సినిమా చేసాం. అందరూ కష్టపడ్డారు. నేను కష్టపడ్డాను. అందరు కూడా చాలా అద్భుతంగా సపోర్ట్ చేశారు. భరణి గారు గోపరాజు రమణ గారు దేవి ప్రసాద్ గారు వారిచ్చిన సపోర్టు ఎప్పటికీ మర్చిపోలేను. ఎవరు కూడా నేను కొత్త వాడినని చూడలేదు. ఎంతో అనుభవం ఉన్న వ్యక్తులానే నన్ను చూసుకున్నారు. డీవోపీ జగదీష్ గారు సినిమాని అద్భుతంగా చూపించారు. ఈ సినిమాకి కథే హీరో. ఇందులో నేను ఎదవ అని ఒక క్యారెక్టర్ చేశాను. ఇది ఒక తండ్రి కొడుకులు కథ, తండ్రి కూతుర్ల కథ, ఒక అమ్మాయి అబ్బాయి కథ ఈ ముగ్గురు మధ్య ఉండే లవ్ స్టోరీ. నిర్మాత బళ్లారి శంకర్ గారు చాలా మంచి వ్యక్తి.పట్నాయక్ గారికి ఈ కథ చెప్తున్నప్పుడే ఒక హిట్ సినిమాకి పనిచేయబోతున్నాం అని చెప్పారు. అది చాలా ఆనందాన్నిచ్చింది. ఈ సినిమాలో అందరూ మంచి పాత్రలు చేశాం. 100% మిమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేస్తాం అని అన్నారు.
