Site icon NTV Telugu

OG: ఇంకా షూటింగ్ కూడా పూర్తి చేసుకోలేదు.. అప్పుడే రికార్డ్స్ సృష్టిస్తుందే.. ?

Og

Og

OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకపక్క రాజకీయాలతో.. ఇంకోపక్క సినిమాలతో బిజీగా మారారు. ఇక ఇప్పుడు అయితే పూర్తిగా రాజకీయాలకు పరిమితమయ్యారు . అందుకు కారణం.. త్వరలోనే ఏపీ ఎలక్షన్స్ ఉండడంతో సినిమాలకు కొద్దిగా గ్యాప్ ఇచ్చి ప్రచారాల్లో బిజీగా మారారు. ఇక ఆయన మధ్యలో వదిలిపెట్టిన సినిమాలో OG ఒకటి. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని DVV ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో పవన్ సరసన ప్రియాంక మోహన్ నటిస్తుంది. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇప్పటికే OG నుంచి వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ ఎంతటి సెన్సేషన్ ను సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇప్పటికే 70 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు కానీ, సెప్టెంబర్ లో కానీ రిలీజ్ కాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక దీంతో పాటు OGకి సంబంధించిన ఒక వార్త నెట్టింట వైరల్ గా మారింది. OG ఆడియో రైట్స్ ని సోనీ సంస్థ దక్కించుకుంది. 20 కోట్ల డీల్ తో OG ఆడియో రైట్స్ సేల్ అయినట్టు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఇది ఒక సరికొత్త రికార్డు అని చెప్పొచ్చు. ఇప్పటివరకు షూటింగ్ కూడా పూర్తిచేసుకొని OG.. ఈ రేంజ్ లో ఆడియో రైట్స్ అమ్ముడుపోవడం ఒక పెద్ద రికార్డ్ అనే చెప్పాలి. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Exit mobile version