Site icon NTV Telugu

Iswarya Menon : స్పై సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఐశ్వర్య మీనన్..

Whatsapp Image 2023 06 26 At 10.45.04 Am

Whatsapp Image 2023 06 26 At 10.45.04 Am

నిఖిల్‌ హీరోగా గ్యారీ బీహెచ్‌ దర్శకత్వంలోవస్తున్న సినిమా స్పై. ఈ సినిమాను కె. రాజశేఖర్‌రెడ్డి నిర్మించిన విషయం తెలిసిందే ఈ చిత్రంను ఈ నెల 29న విడుదల చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్ గా ఐశ్వర్య మీనన్ నటించారు.ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో చిత్ర కథానాయిక ఐశ్వర్యా మీనన్‌ మాట్లాడుతూ ఈ సినిమా లో ని తన క్యారెక్టర్ పై ఈ భామ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడుతూ…ఒక నటిగా నా కెరీర్‌ పట్ల నేను చాలా సంతృప్తిగా ఉన్నాను. నేను హీరోయిన్‌ అవుతానని అస్సలు అనుకోలేదు.. నేను ఒక ఇంజనీర్‌ని నా బ్రదర్ ఒక డాక్టర్‌.కెరీర్ మొదటిలో నేను కొన్ని యాడ్స్‌ లో నటించాను ఆ తర్వాత ఒక్కో అడుగు వేస్తూ ఇప్పుడు హీరోయిన్‌గా మారాను.. ఈ ప్రయాణం నాకు ఆనందంగా ఉంది” అని చెప్పుకొచ్చింది ఐశ్వర్యా మీనన్‌.

తెలుగులో హీరోయిన్‌గా నేను చేసిన మొదటి చిత్రం ‘స్పై’. ఈ చిత్రంలో నా క్యారెక్టర్‌లో ఎన్నో షేడ్స్‌ ఉన్నాయి. ‘రా’ ఏజెంట్‌గా అయితే కనిపిస్తాను. ఈ సినిమాలోని కొన్ని యాక్షన్‌ సీక్వెన్స్‌ల కోసం నేను ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నాను. గన్‌ను సరిగ్గా పట్టుకోవడం అలాగే గన్ షూటింగ్‌ నేర్చుకోవడం వంటి కొత్త విషయాలను నేను నేర్చుకున్నాను.యాక్షన్‌ సన్నివేశాల్లో కూడా నేను బాగా నటించగలననే విషయం నాకు ‘స్పై’తో తెలిసింది.. యాక్షన్‌ సినిమాలు కూడా చేయగలననే కాన్ఫిడెన్స్‌ కూడా నాలో పెరిగింది. ఇక స్వాతంత్య్ర సమరయోధుడు అయిన నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ గారి మరణ రహస్యాల ఆధారంగా అనేది ఈ సినిమా బేస్‌లైన్‌ మాత్రమే అని ఇందులో డ్రామా మాత్రం వేరుగా ఉంటుందని ఆమె చెప్పుకొచ్చారు. గ్యారీగారు ఈ సినిమాలోని హీరోయిన్‌ పాత్రకు ముందుగా నన్నే అనుకున్నారని ఆమె చెప్పుకొచ్చింది.దీంతో ఆయన స్ట్రయిట్‌గా వచ్చి నాకు కథను చెప్పారు. నేను చూసిన మొదటి తెలుగు సినిమా ‘హ్యాపీ డేస్‌’. అలాగే నిఖిల్‌ చేసిన ‘స్వామి రారా’మరియు ‘కార్తికేయ’ చిత్రాలు కూడా నేను చూశాను. ఆయన ప్రతి సినిమాను కూడా నేను ఫాలో అవుతుంటాను. యూవీ క్రియేషన్స్‌లో కార్తికేయ హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో కూడా నేను హీరోయిన్‌గా నటిస్తున్నాను అంటూ ఆమె చెప్పుకొచ్చింది. స్పై సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 27 న జరగనున్నట్లు సమాచారం.

Exit mobile version