Site icon NTV Telugu

Ismart Shankar 2: ఇది కదా ఇస్మార్ట్ కాంబినేషన్ అంటే…

Ismart Shankar 2

Ismart Shankar 2

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఇస్మార్ట్ ఉస్తాద్ హీరో రామ్ పోతినేని కాంబినేషన్ లో 2019లో ఇస్మార్ట్ శంకర్ సినిమా రిలీజ్ అయ్యింది. 2019 జనవరిలో అనౌన్స్ అయ్యి కేవలం ఏడు నెలల్లోనే రిలీజ్ అయిన ఈ మూవీ అనౌన్స్మెంట్ సమయంలో అసలు ఎవరికీ ఎలాంటి అంచనాలు లేవు. పూరి-రామ్ ఇద్దరూ ఫ్లాప్స్ లోనే ఉన్నారు. మణిశర్మ కూడా ఒకప్పటి ఫామ్ లో లేడు. ఇలాంటి కాంబినేషన్ లో సినిమా అంటే ట్రేడ్ వర్గాలు నెగటివ్ లెక్కలు వేసుకుంటాయి. అలాంటి టైంలో ఇస్మార్ట్ శంకర్ సినిమా అందరి దృష్టిలో పడేలా చేశాడు మణిశర్మ. చార్ట్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చిన మణిశర్మ, ఇస్మార్ట్ శంకర్ సినిమాని ఆడియన్స్ లోకి తీసుకోని వెళ్ళిపోయాడు. బజ్ పెరగడంతో ఇస్మార్ట్ శంకర్ సినిమాపై అంచనాలు పెరిగాయి. హిట్ ఇస్తారేమో అనే హాప్ తో పూరి అండ్ రామ్ పోతినేని ఫాన్స్ థియేటర్స్ లోకి ఎంటర్ అయ్యారు. హిట్ కాదు సూపర్ హిట్ ఇస్తాము తీసుకోండి అంటూ ఒక హై వోల్టేజ్ సినిమాని ఆడియన్స్ కి గిఫ్ట్ గా ఇచ్చారు.

16 కోట్ల బడ్జట్ తో రూపొందిన ఈ మూవీ ఓవరాల్ గా 80 కోట్ల వరకూ రాబట్టి ట్రేడ్ వర్గాలకి కూడా ఊహించని షాక్ ఇచ్చింది. పూరి మార్క్ డైలాగ్స్, రామ్ పోతినేని షాకింగ్ మేకోవర్, హీరోయిన్స్ గ్లామర్, మణిశర్మ దుమ్ము లేపే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇస్మార్ట్ శంకర్ సినిమాకి రిపీట్ ఆడియన్స్ ని తెచ్చాయి. ఈ సినిమాతో లవర్ బాయ్ లా ఉండే రామ్ పోతినేని మాస్ హీరో అయిపోయాడు. బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ఈ కాంబినేషన్ ఎట్టకేలకు నాలుగేళ్ల తర్వాత రిపీట్ అవుతోంది. మే 15న రామ్ పోతినేని పుట్టిన రోజున పూరి-రామ్ పోతినేని కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ అవ్వనుంది. ఈ విషయాన్ని రివీల్ చేస్తూ పూరి కనెక్ట్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. మరి ఈ క్రేజీ కాంబినేషన్ లో ఇస్మార్ట్ శంకర్ 2 వస్తుందా లేక ఇంకో కొత్త సినిమా వస్తుందా అనేది చూడాలి.

Exit mobile version