Site icon NTV Telugu

‘రైజ్ ఆఫ్ శ్యామ్’: ఎదురులేని బెంగాలీ నాయకుడిగా నాని

న్యాచురల్ స్టార్ నాని హీరోగా టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం శ్యామ్ సింగరాయ్.. 1970 లో కలకత్తా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్ ఈ సినిమాపై అంచనాలను పెంచేసాయి. ఇక తాజాగా ఈ చిత్రం మొదటి సింగిల్ ని మేకర్స్ దీపావళి కానుకగా విడుదల చేయనున్నట్లు తెలిపారు. రైజ్ ఆఫ్ శ్యామ్ పేరుతో ఒక ప్రోమో ను విడుదల చేసిన మేకర్స్ ఈ పూర్తి పాటను నవంబర్ 6న విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇక ఈ ప్రోమో లో నాని లుక్ మాత్రం అదరగొట్టేసిందనే చెప్పాలి.

కలకత్తాలో ఒక బెంగాలీ యువకుడు ఒక లెజెండ్ గా ఎదిగిన వైనాన్ని కల్లకలు కట్టినట్లు చూపించబోతున్నట్లు తెలుస్తోంది. బెంగాలీ దాదాగా నోట్లో సిగార్ తో, తీక్షమైన చూపుతో నాని లుక్ అదిరిపోయింది. అందుకు తగ్గట్టుగానే కృష్ణ కాంత్ రాసిన లిరిక్స్ కి మిక్కీ జె మేయర్ సంగీతం తోడైన ఈ ప్రోమో గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు.

https://youtu.be/ZuQuOSPO51M
Exit mobile version