NTV Telugu Site icon

Sai Dharam Tej: ‘విరూపాక్ష’ పెద్దలకు మాత్రమేనా!?

Sai

Sai

Virupaksha: సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ తాజా చిత్రం, తొలి పాన్ ఇండియా మూవీ ‘విరూపాక్ష’ ఈ నెల 21న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. కార్తీక్ దండు దర్శకత్వంలో సుకుమార్ రైటింగ్స్ తో కలిసి బీవీఎస్ఎన్ ప్రసాద్ దీన్ని నిర్మించారు. అయితే మూడు నాలుగు రోజుల క్రితమే ‘విరూపాక్ష’ మూవీ సెన్సార్ కార్యక్రమాలను ముగించుకున్నదని ఫిల్మ్ నగర్ సమాచారం. బట్… మేకర్స్ మాత్రం ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. దానికి కారణం ఈ చిత్రానికి ‘ఎ’ సర్టిపికెట్ లభించడమే అని తెలిసింది. ఇటీవల రవితేజ నటించి ‘రావణాసుర’ మూవీకి సైతం ‘ఎ’ సర్టిఫికెట్ వచ్చింది. సహజంగా సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కాగానే ఉత్సాహంతో దానికి సంబంధించి పోస్టర్ ను విడుదల చేసే నిర్మాతలు ‘రావణాసుర’ విషయంలో అలా చేయలేదు. చాలా మౌనంగా పోస్టర్ మీద ఓ మూలగా ‘ఎ’ అనేది మెన్షన్ చేశారు. ఇప్పుడు ‘విరూపాక్ష’ విషయంలోనూ అలానే జరుగబోతోందనిపిస్తోంది.

ఎందుకంటే మొదటి నుండి రవితేజ తరహాలోనే సాయి ధరమ్ తేజ్ కు ఫ్యామిలీ ఆడియెన్స్ నుండి మంచి ఆదరణ ఉంది. ముఖ్యంగా పిల్లలు తేజు సినిమాలు చూడటానికి ఆసక్తి చూపిస్తుండేవారు. కానీ ‘విరూపాక్ష’ కథలోని అడల్డ్ కంటెంట్ తో పాటు హారర్ సీన్స్ అధికంగా ఉన్నందునే ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. ‘రావణాసుర’ విషయంలోనూ అదే జరిగింది. అయితే ‘ఎ’ సర్టిపికెట్ పొందిన ‘రావణాసుర’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏ మాత్రం మెప్పించలేకపోయింది. సెన్సార్ వారి అభ్యంతరాలకు అనుగుణంగా దాన్ని ఎడిట్ చేస్తే… సోల్ మిస్ అవుతుందని భావించిన ‘రావణాసుర’ నిర్మాతలు తమకు ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చినా ఇబ్బంది లేదని చెప్పేశారట. అయితే ‘విరూపాక్ష’ విషయంలో సెన్సార్ సభ్యులు ఏ విషయంలో అభ్యంతరం పెట్టారో తెలియాల్సి ఉంది. ఏదేమైనా పిల్లలు అమితంగా ఇష్టపడే సాయిధరమ్ తేజ్ మూవీకి ‘ఎ’ సర్టిఫికెట్ లభించడం ఫ్యాన్స్ కు నిరాశను కలిగించే అంశమే! ఇదిలా ఉంటే శనివారం సాయంత్రం విజయవాడలోని పీవీఆర్ మాల్ లో సాయిధరమ్ తేజ్ మెగాభిమానులను కలువబోతున్నాడు.

Show comments