అఖిల్… బాక్సాఫీస్ హిట్ కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అక్కినేని బుల్లోడు. ఇప్పటి వరకూ అఖిల్ నటించిన సినిమాలలో పర్వాలేదనిపించింది ఒక్క ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ మాత్రమే. ఇప్పుడు అతగాడి ఆశలన్నీ రాబోయే ‘ఏజెంట్’ సినిమా మీదనే. దాంతో ఈ సినిమా షూటింగ్ బాగా ఆలస్యం అవుతోంది. దీనికి దర్శకుడు సురేందర్ రెడ్డి. చిరంజీవితో ‘సైరా8 సినిమా తర్వాత రెడ్డి చేస్తున్న సినిమా ఇది. భారీ స్థాయిలో ఆరంభం అయిన ఈ చిత్రం స్క్రిప్ట్ లో మార్పులు చోటు చేసుకోవడం వల్ల షూటింగ్ ఆగింది. ఎకె ఎంటర్ టైటన్ మెంట్స్ తో కలసి సురేందర్ రెడ్డి స్వయంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు.
Read Also : Singer Deepu : గీతా మాధురితో పాట పాడను… ఎందుకంటే ?
ఇదిలా ఉంటే హీరో అఖిల్ తండ్రి అక్కినేని నాగార్జున పదే పదే స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేస్తుండటం దర్శకుడు సురేందర్ రెడ్డిని ఇరకాటంలో పెడుతోందట. అఖిల్ గత సినిమాలు ‘అఖిల్, హలో, మిస్టర్ మజ్ను’ సినిమాలకు నాగర్జున పలు మార్పులు, చేర్పులు చేసినా బాక్సఫీప్ వద్ద ఎలాంటి మ్యాజిక్ జరగలేదని అయినా ఇప్పుడు మళ్ళీ స్ర్కిప్ట్ లో తలదూర్చటం పట్ల దర్శకుడు సురేందర్ రెడ్డి సన్నిహితులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారట. అటు సురేందర్ రెడ్డి సైతం ‘సైరా’తో సరైన బ్లాక్ బస్టర్ అందుకోకపోవడం కూడా సినిమా మీద ప్రెజర్ ను పెంచుతోంది. స్పై థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ‘ఏజెంట్’లో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుండగా మమ్ముట్టి కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాకు తమిళ సంగీత దర్శకుడు హిప్ హాప్ తమిళ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాకు వక్కంతం వంశీ కథను అందించారు. మరి ‘ఏజెంట్’తో అఖిల్, సురేందర్ రెడ్డి హిట్ అందుకుంటారేమో చూడాలి.
