Site icon NTV Telugu

షాకింగ్: సమంత ప్రెగ్నెంట్..?

samantha

samantha

ప్రస్తుతం హీరోయిన్లు.. గ్లామర్ రోల్స్ కి మాత్రమే పరిమితమవ్వాలని కోరుకోవడంలేదు. హీరో పాత్రకు తీసిపోకుండా .. ఛాలెంజింగ్ రోల్స్ నే ఇష్టపడుతున్నారు. అందుకోసం ఎంతటి కష్టమైన భరిస్తున్నారు. ఇక వీటికోసం లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కి సై అంటున్నారు. ఇప్పటికే చాలామంది హీరోయిన్లు ఛాలెంజింగ్ రోల్స్ లో నటించి మెప్పించారు. లేడి ఓరియెంటెడ్ మూవీ.. అందులోను హీరోయిన్ గర్భిణీ పాత్ర అంటే మాములు విషయం కాదు. ఇలాంటి పాత్రలను ఒకప్పుడు రమ్య కృష్ణ, శ్రీదేవి లాంటి వారు చేసేవారు. ఇక ఇటీవల నయనతార, కీర్తి సురేష్, విద్యా బాలన్ చేసి నటిగా తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.

ఇక తాజాగా వీరి కోవలోకే వస్తుంది టాలీవుడ్ సౌత్ హీరోయిన్ సమంత. సామ్ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న యశోద సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. హరి మరియు హరీష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సామ్ ప్రెగ్నెంట్ గా కనిపించబోతుందంట. ఇప్పటికే ఈ సినిమాలో సామ్ నర్స్ గా కనిపిస్తుందని వార్తలు గుప్పుమంటున్న వేళ ఆమె ప్రెగ్నెంట్ కూడా కనిపిస్తుంది అనేసరికి ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నర్స్ అయినా ఒక గర్భిణీ మహిళకు కొన్ని అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు .. ఆమె ఒక్కత్తే ఎలా వాటన్నింటినీ ఎదుర్కొంది అనే కోణంలో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.

ఇక దీంతో సామ్ కల ఈ విధంగానైనా నెరవేరబోతోంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. చైతన్యతో సామ్ విడిపోవడానికి కారణం పిల్లలు అని, సామ్ పిల్లలు కావాలనుటుండగా.. చై వద్దని అన్నాడని, అందుకే అభిప్రాయ బేధాల వలన వారు విడిపోయినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఏదిఏమైనా ఈ సినిమాతో సామ్ గర్భవతి కోరికను తీర్చుకొంటుంది అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందొ తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతం హైదరాబాద్ లో లాంచింగ్ షెడ్యూల్ తో షూటింగ్ ప్రారంభం కాగా.. తదుపరి షెడ్యూల్ త్వరలో ప్రారంభమవుతుంది.మరి బేబీ బంప్ తో సామ్ ఎలా కనించనుందో చూడాలి.

Exit mobile version