NTV Telugu Site icon

Sai Pallavi: ఆ సీక్వెల్ కనుక సాయి పల్లవి చేసి ఉంటే.. నా సామీరంగా

Sai

Sai

Sai Pallavi: ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన హీరోయిన్ సాయి పల్లవి. ప్రతి హీరోయిన్ ఇండస్ట్రీకి డబ్బు కోసమో, పేరు కోసమో వస్తారు.. దానికోసం ఏదైనా చేస్తారు.. అవకాశాల కోసం అందాల ఆరబోత, రొమాన్స్, లిప్ లాక్ లు అంటూ ఏవేవో ప్రయత్నాలు సాగిస్తూ ఉంటారు. ఒక్క సినిమా హిట్ వచ్చిందా? ఎక్కడలేని యాటిట్యూడ్ని చూపిస్తూ ఉంటారు. కానీ వీరందరికీ భిన్నమైంది సాయిపల్లవి. ఆమె సినిమాల్లోకి డబ్బు కోసమో..? పేరు కోసమో..? రాలేదు. ఒక డాన్సర్ గా తనకెంత సంతృప్తి ఉందో.. తాను చేసే సినిమాల వలన ప్రేక్షకులు తనను ఒక నటిగా గుర్తిస్తే చాలు అనుకొని ఆమె సినిమాలోకి అడుగు పెట్టింది. మొదటి నుంచి కూడా పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు తప్ప ఏ సినిమాలో కూడా గ్లామర్ ఒలకబోయడం కానీ, హీరోలతో ఘాటు రొమాన్స్లకు దిగడం కానీ చేయలేదు. ఇప్పటివరకు మంచి మంచి పాత్రల్లో చూసిన అభిమానులు ఆమెను ఒక డాన్సర్ గా చూడాలని ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. స్వతహాగా డాన్సర్ అయిన సాయిపల్లవి అలాంటి సినిమా చేస్తే అద్భుతంగా ఉంటుందని వారు చెప్పుకొచ్చేవారు.

Rashmika Mandanna: బిగ్ బ్రేకింగ్.. అరుదైన గౌరవం అందుకున్న రష్మిక

ఇక అలాంటి సినిమా వచ్చినా కూడా సాయిపల్లవి నో చెప్పిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ సినిమానే చంద్రముఖి 2. పి వాసు దర్శకత్వంలో రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ జంటగా నటించిన చిత్రం చంద్రముఖి 2. 2005లో వచ్చిన చంద్రముఖికి ఈ సినిమా సీక్వెల్ గా వస్తుంది. అయితే ముందు కంగనా ప్లేస్ లో చంద్రముఖిగా సాయిపల్లవిని మేకర్స్ అనుకున్నారట. ఈ విషయమై సాయిపల్లవి తో సంప్రదింపులు కూడా జరిపారట కానీ కొన్ని కారణాలవల్ల ఆమె ఈ సినిమాను తిరస్కరించిందని టాక్ నడుస్తుంది. దీంతో సాయిపల్లవి ప్లేస్ లో కంగనా వచ్చిందని తెలుస్తుంది. ఒకవేళ సాయిపల్లవి కనుక చంద్రముఖి 2 చేసి ఉంటే ఈ సినిమా వేరే లెవెల్ లో ఉండేదని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్, డాన్సర్ సాయి పల్లవి మధ్య ఒక సాంగ్ ఉంటే అభిమానులకు కన్నుల పండుగ ఉండేదని చెప్పొచ్చు. ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ, చంద్రముఖిగా సాయిపల్లవి నటిస్తే.. నా సామీరంగా.. ఇండస్ట్రీలో కొత్త రికార్డులు సృష్టించేదే అని అభిమానులు చెప్పుకొస్తున్నారు.

Show comments