NTV Telugu Site icon

Project k: ప్రభాస్ ప్రాజెక్ట్ కె సినిమా విడుదల వాయిదా పడబోతుందా..?

Whatsapp Image 2023 06 13 At 8.21.06 Am

Whatsapp Image 2023 06 13 At 8.21.06 Am

బాహుబలి సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా మారాడు.. తరువాత ఆయన చేసే ప్రాజెక్ట్ కే సినిమా తర్వాత ప్రభాస్ హాలీవుడ్ హీరో అవుతాడు అని గతంలో భారీ మాస్ ఎలివేషన్ కూడా ఇచ్చాడు నిర్మాత సీ.అశ్వినీదత్. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇండియాలోనే అత్యధిక ఖర్చుతో రూపొందుతున్న సినిమా. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. మేకర్స్‌ ఈ సినిమాను ఇంటర్నేషనల్‌ లెవల్లో రూపొందిస్తున్నట్లు ఫస్ట్ నుంచి చెబుతూనే వస్తున్నారు. దానికి తగ్గట్లే ఈ సినిమా కోసం కొత్తగా కార్లు వంటివి కూడా తయారు చేస్తున్నారు. ఇక ఇటీవలే రీఇన్వెంటింగ్‌ ది వీల్‌ అంటూ ఓ వీడియోను కూడా రిలీజ్‌ చేశారు. ఒక్క టైరు కోసం చిత్రయూనిట్‌ ఎంత కష్టపడిందో ఆ వీడియోలో చూపించారు. ఆ వీల్‌ సహాయంతోనే ప్రభాస్‌ టైమ్‌ ట్రావెల్ చేయబోతున్నట్లు కూడా సమాచారం. ప్రభాస్ కూడా ఈ సినిమా కోసం బాగానే కష్టపడుతున్నాడని సమాచారం.

ఈ సినిమాను సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది.. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్ ను కూడా వదిలింది. అయితే ఇప్పుడు ఈ సినిమా చెప్పిన సమయానికి రాకపోవచ్చు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. నిన్న రవితేజ ఈగల్ సినిమా పోస్టర్ కూడా విడుదలైంది.. అందులో సంక్రాంతికి సినిమాను విడుదల చేస్తున్నట్లు అందులో ఉంది.కాగా ఆ సినిమాను పీపుల్ మీడియా బ్యానర్ నిర్మిస్తుంది. ఇక పీపుల్ మీడియా ప్రభాస్ కు ఎంతో క్లోజ్. ఇప్పటికే ప్రభాస్, మారుతి కాంబోలో తెరకెక్కుతున్న సినిమాను కూడా నిర్మిస్తుంది. ఏ ప్రొడ్యూసర్ సాహసం చేయలేని విధంగా ఆదిపురుష్ హక్కులను కోట్లు పెట్టి అయితే కొనుక్కుంది. అంతేకాకుండా ప్రభాస్ నెక్స్ట్ సినిమా స్పిరిట్ కు సహ-నిర్మాతగా కూడా ఉండబోతున్నట్లు కూడా తెలుస్తుంది. ఇలా మూడు సినిమాలను టేకోవర్ చేసి ప్రభాస్ కు ఎంతగానో దగ్గరయ్యారు.దాంతో ప్రాజెక్ట్ కే సంక్రాంతికి రాదనే సమాచారంతోనే పీపుల్ మీడియా వాళ్లు ఈగల్‌ సినిమాను సంక్రాంతి కి షెడ్యూల్ చేసినట్లు సమాచారం.ఇక లేటెస్ట్ గా ప్రాజెక్ట్ కే సినిమా కోసం మ్యూజిక్ వర్క్ ను స్టా్ర్ట్ చేసినట్లు సంతోష్ నారాయణన్ వెల్లడించిన విషయం తెలిసిందే.. సై-ఫై జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమితాజ్ బచ్చన్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. దీపిక పదుకొణె హీరోయిన్ గా నటిస్తుంది

Show comments