NTR 30: ప్రస్తుతం ఇండస్ట్రీని ఊపేస్తున్న సినిమాల్లో ఎన్టీఆర్ 30 ఒకటి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాపై ఎన్టీఆర్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇంకా సెట్స్ మీదకు కూడా వెళ్లకముందే హిట్ కాంబో అంటూ చెప్పుకొస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను ఇటీవలే మొదలుపెట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్ అయితే ఎన్ని సంచలనాలను సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పోస్టర్ ను చూసి ఈ సినిమాకు కొరటాల పవర్ ఫుల్ టైటిల్ ను ఫిక్స్ చేసేలా ఉన్నాడే అని అందరు అనుకుంటున్నారు. అయితే.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ టైటిల్ బాధ్యతలను నిర్మాత బండ్ల గణేష్ అందుకున్నాడట.
మొదటి నుంచి పవన్ కళ్యాణ్ పరమ భక్తుడైన బండ్ల.. పవన్ తో ఒక్క ఛాన్స్ దొరికితే దేవర అనే టైటిల్ తో సినిమా చేస్తాను అని ఎన్నోసార్లు చెప్పుకొచ్చాడు. కాగా ఇప్పుడు ఈ టైటిల్ ను ఎన్టీఆర్ కు ఇచ్చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ 30 ని పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారట. అందుకు తగ్గట్టు టైటిల్ ఉండాలని మేకర్స్ అభిప్రాయం వ్యక్తం చేసి దేవర టైటిల్ కోసం బండ్లను అడుగగా.. బండ్లన్న కూడా ఓకే అన్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఇక ఈ వార్త విన్న దగ్గరనుంచి పవన్ ఫ్యాన్స్ బండ్లన్నపై గుర్రు మంటున్నారు. దేవర అనే టైటిల్ పవన్ కు మాత్రమే సొంతమని, బండ్లన్న ఎలా ఇచ్చేస్తాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వార్తలో నిజం ఎంతో తెలియాలంటే బండ్ల గణేష్ నోరు విప్పాల్సిందే.
