NTV Telugu Site icon

Bigg Boss 7 Telugu: గ్రాండ్‌ ఫినాలేకి మహేష్‌ బాబుని పిలిచారా? లేదా?

Mahesh

Mahesh

Is Mahesh Babu Invited as Guest for Bigg Boss 7 Telugu or not: `బిగ్‌ బాస్‌ తెలుగు 7`వ సీజన్‌ 105 రోజులు పూర్తి చేసుకోగా నేడు ఆదివారం అంటే డిసెంబర్‌ 17న గ్రాండ్‌గా ఫినాలే ఈవెంట్‌ జరగబోతుంది. ఆల్‌ రెడీ ఫినాలే షూట్‌ ప్రారంభమవగా ఇప్పటికే రెండు రోజులుగా ఈ షూట్‌ జరుగుతోంది. ఇప్పటికే టాప్‌ 6 నుంచి నలుగురు ఎలిమినేట్‌ అయినట్టు లీకులు బయటకు వచ్చాయి. టైటిల్‌ కోసం పోటీలో ఉన్నాడనుకున్న శివాజీ కూడా టాప్ 3వ వ్యక్తిగా ఎలిమినేట్‌ అయినట్టు తెలుస్తుంది. ఇక తాజాగా బిగ్‌ బాస్‌ లీక్స్ ప్రకారం రవితేజ, నరేష్‌, రాజ్‌ తరుణ్‌, సుమ, ఆమె కొడుకు, అలాగే బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్ల పర్‌ఫెర్మెన్స్ లు ఇలా ఆద్యంతం సందడిగా ఈవెంట్‌ జరిగిందని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం పల్లవి ప్రశాంత్‌, అమర్‌ దీప్ మధ్య పోటీ ఉన్నట్టు తెలుస్తుంది.

Sumaya Reddy: హీరోయిన్‌గా మరో తెలుగమ్మాయి

అయితే ప్రతి సీజన్‌లో టాలీవుడ్‌కి చెందిన స్టార్ హీరో ఎవరో ఒకరి చేత విన్నర్స్ ని ప్రకటిస్తారు. గత సీజన్లలో పలువురు స్టార్లు ఉన్నారు. నాల్గో సీజన్‌లో చిరంజీవి రాగా ఐదో సీజన్‌లో నాగార్జునే ప్రకటించారు. ఆరో సీజన్‌లో గెస్ట్ ల అవసరమే లేకుండా అనౌన్స్ చేశారు. ఇక ఈ ఏడో సీజన్ లో సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు గెస్ట్ గా వస్తారని ప్రచారం జరిగింది, ఆల్మోస్ట్ ఫైనల్‌ అయ్యిందని కూడా అన్నారు. కానీ అనూహ్యంగా మహేష్‌ ఈ ఈవెంట్‌ కి రావడం లేదని తెలుస్తోంది. అసలు ఆయన హాజరు అవుతారు అనే వార్త నిజం కాదని, అసలు ఆయనని పిలవడం కూడా నిజం కాదని తెలుస్తోంది. అయితే అసలు నిర్వాహకులు ఎవరిని గెస్టుగా పిలిచారు? ఎవరు హాజరు కానున్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నాగార్జునే విన్నర్స్ ని ప్రకటిస్తారా? లేక ఈ గ్యాప్‌లో ఎవరినైనా గెస్ట్ లను ఆహ్వానిస్తారా? అనేది చూడాలి.

Show comments