Site icon NTV Telugu

Samantha: ఇదెక్కడి మాస్ ట్విస్ట్ రా బాబు.. ఆమెకు తల్లిగా సమంత..?

Priyanka

Priyanka

Samantha: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సిటాడెల్ ఇండియన్ వెర్షన్ లో నటిస్తున్న విషయం తెల్సిందే. ది ఫ్యామిలీ మ్యాన్ క్రియేటర్స్ రాజ్ అండ్ డీకే ఈ సిరీస్ కు దర్శకత్వం వహిస్తున్నారు. వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న ఈ సిరీస్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఇంగ్లీష్ వెర్షన్ లో ప్రియాంక చోప్రా చేసిన పాత్రలో సమంత నటిస్తుంది అంటూ వార్తలు వచ్చాయి. ఇప్పటికే సిటాడెల్ ఇంగ్లీష్ వెర్షన్.. అమెజాన్ లో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెల్సిందే కేవలం 6 ఎపిసోడ్స్ లో మొదటి సీజన్ ను ముగించారు. గతాన్ని మర్చిపోయిన హీరోకు.. చివరి ఎపిసోడ్ లో గతాన్ని గుర్తుచేస్తుంది ప్రియాంక .. ఇక సిటాడెల్ ను తానే నాశనం చేశానని తెలుసుకున్న హీరో ఎవ్వరికీ ఏం చెప్పకుండా వెళ్లిపోవడంతో సీజన్ ముగుస్తుంది. ఇంకో సీజన్ 2 గా సిటాడెల్- డయానా వచ్చే ఏడాది రాబోతుందని మేకర్స్ తెలిపారు.

RRR: ఆ రోజుల్లోనే ‘RRR’ కాంబినేషన్.. వీడియో వైరల్

ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. హిందీ సిటాడెల్.. ఇంగ్లీష్ వెర్షన్ కు రీమేక్ కాదట.. ప్రీక్వెల్ అంట. అంటే.. ప్రియాంక చోప్రా తల్లిదండ్రులుగా వరుణ్ ధావన్, సమంత కనిపించబోతున్నారట. సిటాడెల్ లో ప్రియాంక కు ఒక తండ్రి ఉంటాడు. అతడు కూడా సిటాడెల్ ఏజెంటే అని, తనకూతురును ఆమె తాత వద్ద పెంచినట్లు చెప్తుంది. ఇప్పుడు హిందీ వెర్షన్ లో ప్రియాంక తల్లిదండ్రుల కథను రివీల్ చేస్తారట.. 1990 కాలంలో ఈ కథ నడుస్తుంది అంట. ఇక ఇదంతా ప్రీక్వెల్ అయితే.. వచ్చే ఏడాది వచ్చే డయానా సీక్వెల్ అన్నమాట.. వినడానికి కొద్దిగా కన్ఫ్యూజ్ గా ఉంది కదా .. దీని మీద మేకర్స్ ఏమైనా కక్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Exit mobile version