NTV Telugu Site icon

Darshan: ‘నన్ను వదిలేయండి’ ప్లీజ్.. పోలీసుల కాళ్లపై పడ్డ దర్శన్?

Actor Darshan Areest

Actor Darshan Areest

Is Darshan Regretting in Renuka Swamy Murder Case: ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ పోలీసుల అదుపులో ఉన్నాడు. చిత్రదుర్గకు చెందిన తన అభిమాని రేణుకాస్వామిని దారుణంగా హత్య చేసిన కేసులో దర్శన్ అరెస్టయ్యాడు. దర్శన్ లివిన్ పార్టనర్ పవిత్ర గౌడకు అసభ్యకరమైన సందేశాలను పంపినందుకు రేణుకాస్వామి దారుణ హత్యకు గురయ్యారు. హత్య కేసులో పవిత్ర గౌడ మొదటి ముద్దాయి అయితే, దర్శన్ రెండో నిందితుడు. ‘‘హత్య కేసులో పట్టుబడినప్పటి నుంచి నేనేమీ చేయలేదు. నాకేమీ తెలియదు అని దర్శన్ చెప్పేవాడట. ఇప్పుడు ఒక్కొక్కరుగా సాక్షులు తెర మీదకు రావడంతో దర్శన్ వరస మారుతున్నట్లు తెలుస్తోంది. దర్శన్ పోలీసుల కాళ్లపై పడేందుకు వెళ్లినట్లు సమాచారం. తొలుత దర్శన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పుడు “నేనేమీ చేయలేదు. నాకేమీ తెలియదు’’ అని దర్శన్ అన్నారు. పోలీసు కస్టడీ పొడిగించడంతో దర్శన్ ఆందోళన చెందుతున్నాడు. పోలీసు కస్టడీలో ఉన్న దర్శన్ పశ్చాత్తాపం చెందుతాడు. ఇంటరాగేషన్ సమయంలో, దర్శన్ “సార్, నన్ను వదిలేయండి” అని వేడుకున్నాడని, అంతే కాకుండా దర్శన్ పోలీసుల కాళ్లపై పడేందుకు వెళ్లాడని అంటున్నారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నన్ను వదిలేయండి’’ అంటూ దర్శన్ కాళ్లమీద పడ్డాడని అంటున్నారు.

Yuva Rajkumar: యువ రాజ్‌కుమార్కి లైంగిక సమస్యలు.. హోటల్లో నటితో రెడ్ హ్యాండెడ్ గా దొరికి?

మరోపక్క పవిత్ర గౌడ నివాసానికి వెళ్లిన పోలీసులు హత్యకు ఉపయోగించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. పవిత్ర గౌడ తన చెప్పులతో రేణుకాస్వామిని కొట్టగా హత్య సమయంలో పవిత్రగౌడ్ ధరించిన బట్టలు, చెప్పులు స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు రాజరాజేశ్వరి నగర్‌లోని పవిత్రగౌడ్ నివాసానికి వెళ్లారు. ఈ సమయంలో పవిత్ర గౌడను కూడా పోలీసులు తీసుకొచ్చారు. ఇంటి నుంచి బయటకు వస్తున్న సమయంలో పవిత్ర గౌడ నవ్వుతూ కనిపించింది. పవిత్ర గౌడ హౌస్ కీపర్ A3 పవన్ కూడా నవ్వుతూ కెమెరా కంటికి దొరికిపోయాడు. వీరిద్దరి వీడియో కూడా వైరల్‌గా మారింది. పవిత్ర గౌడకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని, అపరాధభావంతో బాధ పడడం లేదని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. దర్శన్ వారం రోజులుగా పోలీసు కస్టడీలో ఉన్నారు. అయితే తల్లి మీనా తూగుదీప, సోదరుడు దినకర్ తూగుదీప, భార్య విజయలక్ష్మి, కుమారుడు వినీష్ దర్శన్ ను చూడడానికి రాలేదు.

Show comments