మన స్టార్ హీరోల బాటలోనే విజయ్ దేవరకొండ కూడా ప్యాన్ ఇండియా బాట పట్టిన సంగతి తెలిసిందే. పూరి దర్శకత్వంలో కరణ్ జోహార్ తో కలసి పూరి కనెక్ట్స్ ‘లైగర్’ని నిర్మిస్తోంది. దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ నిర్మితమవుతున్న ఈ చిత్రంతో విజయ్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఇప్పుడు బడ్జెట్ సమస్యలను ఎదుక్కొంటోందట. ఏ సినిమానైనా అనుకున్న టైమ్ లో పూర్తి చేయటం పూరికి అలవాటు. అయితే రెండు సార్లు కరోనా దెబ్బ తీయటంతో బడ్జెట్ బాగా పెరిగిందట. ఇక మైక్ టైసన్ ‘లైగర్’ సినిమాలో నటిస్తున్నాడనగానే ప్రాజెక్ట్ లుక్ మారిపోయింది. మైక్ టైసన్ అంటే భారీ ఖర్చుతో కూడిన వ్యవహారం. ఇప్పుడు వెనక్కి తగ్గలేరు. దాంతో బిజినెస్ కి సంబంధం లేకుండా ఖర్చు పెట్టవలసిన పరిస్థితి. ఇక విజయ్ కి ఇది తొలి ప్యాన్ ఇండియా సినిమా కావటంతో తనపై పెట్టిన ఖర్చు ఎంత వరకూ రిటర్న్ వస్తుందో తెలియని స్థితి. దీంతో వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేయాలని పూరి, కరణ్ భావిస్తున్నారట. బడ్జెట్ పెరగటంతో డిజిటల్, థియేట్రికల్ రైట్స్ కోసం భారీ కోట్ చేస్తున్నారట. మరి వారు కోట్ చేసిన ధరకు అమ్ముడు పోతుందా? లేదా? అన్నది చూడాలి.
బడ్జెట్ సమస్యల్లో ‘లైగర్’!?
