Site icon NTV Telugu

Anasuya : అనసూయ, విజయ్ దేవరకొండ మధ్య వివాదం ముగిసినట్టేనా..?

Whatsapp Image 2023 06 09 At 1.51.12 Pm

Whatsapp Image 2023 06 09 At 1.51.12 Pm

టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్ ల మధ్య గత కొంతకాలంగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే.వీరిద్దరి మధ్య వివాదం ఎప్పటినుంచో అలాగే కొనసాగుతూనే ఉంది. అనసూయ ఇన్ డైరెక్ట్ గా విజయ్ ని ఉద్దేశించి సోషల్ మీడియా లో ట్వీట్లు చేయడం ఆ ట్వీట్ పై విజయ్ అభిమానులు మండిపడుతూ ఆమెపై ట్రోల్స్ చేయడం ఇవన్నీ కూడా ఎప్పుడూ జరుగుతూ ఉండేవి. ఇక మొట్టమొదటిసారి అనసూయ విజయ్ దేవరకొండ వివాదం పై స్పందించింది. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా లో బాగా వైరల్ గా మారాయి.

ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ.. విజయ్ దేవరకొండ తో నాకు ఎంతో కాలం నుంచి పరిచయం ఉంది.. మేమిద్దరం కూడా మంచి స్నేహితులం. ఆయన హీరో గా నటించిన అర్జున్ రెడ్డి మూవీలో అభ్యంతరకర పదాలను మ్యూట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా విడుదలైనప్పుడు థియేటర్ విజిట్ కి వెళ్లిన విజయ్ అక్కడున్న అభిమానులతో ఆ పదాలను పలికించారని చెప్పుకొచ్చింది.ఒక తల్లిగా అది నన్ను ఎంతో బాధించింది. ఇలాంటివి అస్సలు ప్రోత్సహించవద్దని ఆయనతో చెప్పాను. ఆ తర్వాత నాపై ఆన్లైన్ ట్రోల్స్ బాగా మొదలయ్యాయి. ధైర్యంగా ఆ బాధ నుంచి బయటకు వచ్చిన నేను మీకు మాత్రమే చెప్తా సినిమాలో అయితే నటించాను. విజయ్ కి సంబంధించిన ఒక వ్యక్తి నన్ను ట్రోల్ చేయడం కోసం పలువురికి డబ్బులు ఇస్తున్నాడని కూడా తెలిసి షాక్ అయ్యాను. విజయ్ కి తెలియకుండానే ఇది జరుగుతోందా అని అనిపించింది. విజయ్ నన్ను ద్వేషిస్తున్నాడో లేదో తెలీదు కానీ, ఇక్కడితో దీన్ని ఆపేయాలని, ముందుకు సాగిపోవాలని అయితే నిర్ణయించుకున్నాను. ఎందుకంటే నాకు మానసిక ప్రశాంతత కావాలి అని అనసూయ చెప్పుకొచ్చింది. అనసూయ కు ప్రస్తుతం వరుసగా పెద్ద ఆఫర్స్ వస్తున్నాయి. ఆమె యాంకరింగ్ కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే

Exit mobile version