సోమవారం నటి ఆలియాభట్ ప్రెగ్నెన్సీ టాక్ ఆఫ్ ద సినిమా వుడ్స్ అయింది. దాంతో పెళ్ళయిన రెండు నెలలకే ఎందుకు అలియా, రణ్ బీర్ పిల్లల కోసం సిద్ధపడ్డారన్నది ఎవరికీ ఆర్థం కాని ప్రశ్నగా మిగిలింది. సెట్స్ మీద ఉన్న బాలీవుడ్ సినిమాలలో రెండు పూర్తయ్యాయి. మరొకటి సగానికి పైగా పూర్తయింది. ఇక హాలీవుడ్ సినిమా మాత్రం వదులుకోవాల్సిందే. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ తో కొరటాల శివ తీస్తున్న సినిమాలో ఆలియానే హీరోయిన్ అనే రూమర్స్ వచ్చాయి. అయితే ఆలియా రణబీర్ పెళ్లి అయిన వెంటనే పిల్లల కోసం ప్లాన్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారని, దాంతో అలియా కొత్తగా కమిట్ అయిన సినిమాలనుంచి నిష్క్రమించిందని వినిపిస్తోంది. ఆలియా, రణ్ బీర్ పెళ్ళి జరిగింది ఏప్రిల్ 14న. దాంతో కొంత మంది రణ్ బీర్, అలియా ఎప్పటి నుంచో లివిన్ రిలేషన్ షిప్‌లో ఉండటంతో ఆలియా పెళ్లికి ముందే గర్భం దాల్చిందని, అందుకే ‘ఆర్ఆర్ఆర్’ ప్రచారానికి సైతం హాజరు కాలేదని అంటున్నారు. ఇందులో నిజానిజాలేమిటన్నది అలియా, రణ్ బీర్‌కు మాత్రమే తెలియాలి. ఏది ఏమైనా వెంటనే పిల్లలను కనాలనుకోవడం వల్లే ఆలియా ఎన్టీఆర్30 తో పాటు కమిట్ అయిన ఇతర సినిమాల నుంచి తప్పుకోవటానికి కారణమని బాలీవుడ్ సర్కిళ్లలో ప్రచారంలో ఉంది.
