Site icon NTV Telugu

తల్లి కాబోతున్న ‘సోడాల శ్రీదేవి’

Is actress Anandhi expecting her first baby?

తెలుగమ్మాయి ఆనంది ప్రస్తుతం తమిళంలో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ ప్రారంభంలో ‘ఈ రోజుల్లో, బస్ స్టాప్’ చిత్రాలు ఆనందికి మంచి విజయాన్ని అందించాయి. కానీ ఆ తర్వాత నటించిన తెలుగు సినిమాలు సక్సెస్ కాలేదు. దాంతో తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టి… అక్కడ వరుస విజయాలను తన ఖాతాలో జమ చేసుకుంది. ఈ నేపథ్యంలోనే తమిళ దర్శక నిర్మాత నవీన్ బావమరిది, అసిస్టెంట్ డైరెక్టర్ సోక్రటీస్ తో ప్రేమలో పడింది. పెద్దల అంగీకారంతో ఆనంది వివాహం ఈ యేడాది జనవరి 7వ తేదీ సోక్రటీస్ తో వరంగల్ లో నిరాడంబరంగా జరిగింది.

Read Also : అందరూ మోసగాళ్ళే… “అనబెల్ సేతుపతి” ట్రైలర్

విశేషం ఏమంటే… వివాహం తర్వాత ఆనంది నటించిన రెండు తెలుగు సినిమాలు విడుదలయ్యాయి. అందులో ఒకటి ఫిబ్రవరిలో వచ్చిన ‘జాంబిరెడ్డి’ కాగా మరొకటి గతవారం విడుదలైన ‘శ్రీదేవి సోడా సెంటర్’. ఈ రెండు సినిమాలూ మాస్ ఆడియెన్స్ ను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజా చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’లో సోడా శ్రీదేవిగా నటించి, నటిగానూ మెప్పించింది ఆనంది. ఈ తెలుగు కథానాయిక త్వరలో తల్లి కాబోతోందట. ప్రస్తుతం ఆమెకు ఆరవ నెల అని, అతి త్వరలోనే కుటుంబ సభ్యులు ఆనందికి సీమంతం కూడా చేయబోతున్నారని తెలుస్తోంది. అదే జరిగితే మరో మూడు నెలల్లో ఆనంది పండంటి బిడ్డకు జన్మనివ్వడం ఖాయం.

Exit mobile version