Iravatham: గత యేడాది వచ్చిన సినిమాల్లో థ్రిల్లర్ బేస్డ్ హారర్ మూవీస్ కు చక్కని ఆదరణ లభించింది. ముఖ్యంగా చక్కని కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమాలను జనం బాగా ఆదరించారు. మరో విశేషం ఏమంటే… ఈ తరహా సినిమాలు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లోనూ తమ సత్తాను చాటాయి. ఆ కోవకు చెందిందే ‘ఐరావతం’ చిత్రం. పలు బుల్లితెర సీరియల్స్ లో కథానాయకుడిగా నటించిన అమర్ దీప్ చౌదరి హీరోగా నటించిన సినిమా ‘ఐరావతం’. ఈ మూవీతో ప్రముఖ మోడల్ తన్వీ నెగ్గి హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ మొదటి సినిమాలోనే ఆమె ద్విపాత్రాభినయం చేయడం విశేషం. ఇక సెక్సీ క్యారెక్టర్స్ తో యూత్ ను గత కొంతకాలంగా ఆకట్టుకుంటున్న ఎస్తేర్ నొర్హా ‘ఐరావతం’లో తన ఇమేజ్ కు పూర్తి భిన్నమైన పాత్రను చేసి మెప్పించింది. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ శిష్యుడు సుహాస్ మీరా ఈ సినిమాను ఆద్యాంతం ఆసక్తికరంగా మలిచారు. దాంతో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న ‘ఐరావతం’ సినిమాకు విశేష ఆదరణ లభిస్తోంది. ఇంతవరకూ ఈ సినిమా 100 మిలియన్ అండ్ ఫిఫ్టీ ధౌజండ్ వ్యూయింగ్ మినిట్స్ ను పొంది, తెలుగు సినిమాల్లో టాప్ ఫైవ్ ప్లేస్ ను పొందిందని నిర్మాత రాంకీ పలగాని, బాలయ్య చౌదరి చల్లా, లలిత కుమారి తోట తెలిపారు.

‘ఐరావతం’ సినిమాకు లభిస్తున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు దీనికి సీక్వెల్ తీయడానికి సిద్ధమయ్యారు. ‘ఐరావతం ద్విముఖం’ పేరుతో పార్ట్ 2కు ప్లాన్ చేస్తున్నట్టు చిత్ర సమర్పకులు రేఖ పలగాని చెప్పారు. ఓ తెల్ల కెమెరా చేసిన మాయలను ‘ఐరావతం’లో చూపించిన దర్శకుడు సుహాస్ మీరా… సీక్వెల్ లో ఏ వస్తువును ఉపయోగిస్తాడో చూడాలి. నూజివీడు టాకీస్ పతాకంపై నిర్మితమయ్యే సీక్వెల్ కు సంబంధించిన వివరాలను త్వరలోనే తెలియచేస్తామని నిర్మాతలు అంటున్నారు.
Ester Noronha : ‘ఐరావతం’ సీక్వెల్ కు సన్నాహాలు!

Iravatham (1)