NTV Telugu Site icon

NTR 100th Birth Anniversary: హీరోగా ఎన్టీయార్ మనవడు చైతన్యకృష్ణ!

Bala Krishan

Bala Krishan

 

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు ఆశీస్సులతో ఆయన పెద్ద కుమారుడు నందమూరి జయకృష్ణ ‘బసవతారకరామ క్రియేషన్స్’ పేరుతో కొత్త బ్యానర్ ని స్థాపించారు. నటసింహ నందమూరి బాలకృష్ణ ఈ బ్యానర్ ను మే 28న గ్రాండ్ గా లాంచ్ చేశారు. బసవతారకరామ క్రియేషన్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం1గా నందమూరి జయకృష్ణ కుమారుడు, నందమూరి చైతన్య కృష్ణని హీరోగా పరిచయం చేస్తూ వంశీకృష్ణ ఆకెళ్ళ దర్శకత్వంలో ఒక వైవిధ్యమైన చిత్రం నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ, ”మా అమ్మ, నాన్నగారి పేరు కలిసి వచ్చేలా అన్నయ్య ‘బసవతారకరామ క్రియేషన్స్’ బ్యానర్ ప్రారంభించడం ఆనందంగా ఉంది. ఇది మా సొంత బ్యానర్ . మా అన్నదమ్ములందరి బ్యానర్. దీని ద్వారా నందమూరి చైతన్య కృష్ణ హీరోగా పరిచయం కావడం సంతోషం. నాన్నగారికి చైతన్య కృష్ణ చాలా ఇష్టమైన మనవడు. చైతన్య కృష్ణ ప్రేక్షకుల అభిమానాన్ని పొందాలని మనసారా ఆశీర్వదిస్తున్నాను. చాలా వైవిధ్యమైన కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు వంశీకృష్ణ ఆకెళ్ళకు నా బెస్ట విశేష్. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.

నిర్మాత నందమూరి జయకృష్ణ మాట్లాడుతూ, ”మా తమ్ముడు నందమూరి బాలకృష్ణ బ్యానర్ ని లాంచ్ చేయడం ఆనందంగా వుంది. ‘బసవతారకరామ క్రియేషన్స్’ బ్యానర్ ద్వారా మా అబ్బాయి చైతన్య కృష్ణని హీరోగా పరిచయం చేస్తున్నాం. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం టైటిల్, మిగతా వివరాలు త్వరలోనే ప్రకటిస్తాం” అని తెలిపారు. హీరో చైతన్య కృష్ణ మాట్లాడుతూ, ”నాన్నగారు స్థాపించిన ‘బసవతారకరామ క్రియేషన్స్’ బ్యానర్ ని బాబాయ్ బాలకృష్ణ లాంచ్ చేయడం, ఆశీస్సులు అందించడం చాలా ఆనందంగా వుంది” అని అన్నారు.