Site icon NTV Telugu

OTT Alert : 5 ఇంట్రెస్టింగ్ మూవీస్… డిజిటల్ రిలీజ్ కు రెడీ

OTT

ఈ వారం “రాధే శ్యామ్” వంటి భారీ చిత్రం థియేటర్లలో సందడి చేయబోతోంది. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ చిత్రం మార్చి 11న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే అదే రోజున డిజిటల్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి 5 ఇంట్రెస్టింగ్ మూవీస్. ఈ శుక్రవారం OTT ప్లాట్‌ఫామ్‌లలో ప్రీమియర్ కానున్న ఆ 5 ఆసక్తికర చిత్రాలేంటో చూద్దాం.

  1. మారన్ (డిస్నీ+హాట్‌స్టార్)
    కార్తీక్ నరేన్ దర్శకత్వం వహించిన ఈ పరిశోధనాత్మక థ్రిల్లర్ డిస్నీ+ హాట్‌స్టార్‌లో డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ అవుతోంది. మార్చి 11న తమిళం, తెలుగు రెండు భాషల్లోనూ మూవీని ప్రీమియర్స్ కు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో మాళవిక మోహనన్ కథానాయికగా నటించింది.
  2. ఖిలాడి (డిస్నీ+ హాట్‌స్టార్)
    మాస్ మహారాజ రవితేజ నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఫిబ్రవరి 11న థియేటర్‌లలో విడుదలైంది. సరిగ్గా థియేటర్లలో విడుదలైన ఒక నెల తర్వాత ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్‌ కు సిద్ధమైంది. రమేష్ వర్మ దర్శకత్వం వహించిన ‘ఖిలాడీ’లో డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించారు.
  3. రౌడీ బాయ్స్ (Zee5)
    ఆశిష్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో విడుదలైంది. దాదాపు విడుదలైన రెండు నెలల తర్వాత ఈ చిత్రం జీ 5లో రాబోతోంది.
  4. క్లాప్ (సోనీ LIV)
    ‘మారన్’ లాగానే ‘క్లాప్’ కూడా థియేట్రికల్ విడుదల కాకుండా నేరుగా OTT విడుదలను ఎంచుకుంది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి హీరోగా నటిస్తున్నారు. ఇది సోనీ LIVలో ప్రీమియర్‌ కానుంది. ఆకాంక్ష సింగ్, ప్రకాష్ రాజ్, నాజర్ ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రలు పోషించారు.
  5. QuboolHai? (ఆహా)
    ప్రత్యేక తెలుగు OTT ప్లాట్‌ఫామ్ ఆహా ఈ వారం ఆహా ఒరిజినల్ చిత్రం “ఖుబూల్ హై”తో వస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ను ప్రణవ్ రెడ్డి రూపొందించారు. ఈ చిత్రాలను మీరు మీ వాచ్‌లిస్ట్‌కి జోడించి, ఈ వారాంతంలో హ్యాపీగా మీ ఇంట్లోనే చూడండి.
Exit mobile version