OTT Alert : 5 ఇంట్రెస్టింగ్ మూవీస్… డిజిటల్ రిలీజ్ కు రెడీ
By Prakash
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ వారం “రాధే శ్యామ్” వంటి భారీ చిత్రం థియేటర్లలో సందడి చేయబోతోంది. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ చిత్రం మార్చి 11న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే అదే రోజున డిజిటల్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి 5 ఇంట్రెస్టింగ్ మూవీస్. ఈ శుక్రవారం OTT ప్లాట్‌ఫామ్‌లలో ప్రీమియర్ కానున్న ఆ 5 ఆసక్తికర చిత్రాలేంటో చూద్దాం.
- మారన్ (డిస్నీ+హాట్‌స్టార్)
కార్తీక్ నరేన్ దర్శకత్వం వహించిన ఈ పరిశోధనాత్మక థ్రిల్లర్ డిస్నీ+ హాట్‌స్టార్‌లో డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ అవుతోంది. మార్చి 11న తమిళం, తెలుగు రెండు భాషల్లోనూ మూవీని ప్రీమియర్స్ కు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో మాళవిక మోహనన్ కథానాయికగా నటించింది. - ఖిలాడి (డిస్నీ+ హాట్‌స్టార్)
మాస్ మహారాజ రవితేజ నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఫిబ్రవరి 11న థియేటర్లలో విడుదలైంది. సరిగ్గా థియేటర్లలో విడుదలైన ఒక నెల తర్వాత ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. రమేష్ వర్మ దర్శకత్వం వహించిన ‘ఖిలాడీ’లో డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించారు. - రౌడీ బాయ్స్ (Zee5)
ఆశిష్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో విడుదలైంది. దాదాపు విడుదలైన రెండు నెలల తర్వాత ఈ చిత్రం జీ 5లో రాబోతోంది. - క్లాప్ (సోనీ LIV)
‘మారన్’ లాగానే ‘క్లాప్’ కూడా థియేట్రికల్ విడుదల కాకుండా నేరుగా OTT విడుదలను ఎంచుకుంది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి హీరోగా నటిస్తున్నారు. ఇది సోనీ LIVలో ప్రీమియర్ కానుంది. ఆకాంక్ష సింగ్, ప్రకాష్ రాజ్, నాజర్ ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రలు పోషించారు. - QuboolHai? (ఆహా)
ప్రత్యేక తెలుగు OTT ప్లాట్‌ఫామ్ ఆహా ఈ వారం ఆహా ఒరిజినల్ చిత్రం “ఖుబూల్ హై”తో వస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ను ప్రణవ్ రెడ్డి రూపొందించారు. ఈ చిత్రాలను మీరు మీ వాచ్లిస్ట్కి జోడించి, ఈ వారాంతంలో హ్యాపీగా మీ ఇంట్లోనే చూడండి.
Also Read
- Purusha : భార్యల టార్చర్లు, మగాళ్ల కష్టాలు..క్షేమంగా వెళ్లి లాభంగా రండి వైబ్'లో ‘పురుష:’ ట్రైలర్!
- Peddi : భోపాల్'లో రెహమాన్ లైవ్ కాన్సెర్ట్.. ‘పెద్ది’ ఆడియో జాతర కోసం రూ. 150 కోట్ల భారీ సెటప్!
- Manchu Manoj : మైక్ వద్దు.. హెల్మెట్ పెట్టుకుని వెళ్లండి! మంచు ఫ్యామిలీ వివాదంపై మనోజ్ సెన్సేషనల్ కామెంట్స్
- Pawan Kalyan: మళ్ళీ స్టైలిష్ లుక్'లోకి పవన్ కళ్యాణ్
తాజావార్తలు
-
Rahul Gandhi: మోడీ విదేశీ టూర్లపై రాహుల్ గాంధీ విసుర్లు
-
Mumbai Indians: ముంబై ఇండియన్స్‌కు డబుల్ షాక్.. ఇంటి బాట పట్టిన స్టార్ ప్లేయర్లు..
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
Purusha : భార్యల టార్చర్లు, మగాళ్ల కష్టాలు..క్షేమంగా వెళ్లి లాభంగా రండి వైబ్’లో ‘పురుష:’ ట్రైలర్!
-
Inder kaur: పంజాబ్ గాయని ఇందర్ కౌర్ హత్య.. కాలువలో శవం లభ్యం
ట్రెండింగ్
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!