దిగ్గజ దర్శకుడు రాజమౌళి మాగ్నమ్ ఓపస్ ‘ఆర్ఆర్ఆర్’ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవగన్, అలియా భట్ నటించిన ఈ పాన్ ఇండియా మూవీ విడుదల కోవిడ్-19, ఒమిక్రాన్ వేరియంట్ వల్ల మళ్లీ ఆలస్యం అయిందన్న విషయం తెలిసిందే. అయితే ఓ ఇంటర్వ్యూలో ‘ఆర్ఆర్ఆర్’ త్రిమూర్తులు రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సృజనాత్మక స్వేచ్ఛ, స్వంత ఊహతో భారతదేశ స్వాతంత్య్ర పోరాటంపై చారిత్రక అభిమానుల మనోభావాలను ఎలా సమతుల్యం చేశారో వివరించారు.
Read Also : షాక్ ఇచ్చిన నెట్‌ఫ్లిక్స్… ‘బాహుబలి’ వెబ్ సిరీస్ రద్దు
“ఒక కథ కమర్షియల్‌గా ఉందా లేదా ? అది పెట్టిన డబ్బు మొత్తం తెస్తుందా అనేది పూర్తిగా భిన్నమైన అంశం. చారిత్రాత్మకమైనా, కల్పితమైనా లేదా రెండింటి కలయిక అయినా, ఆ అంశం ప్రతి చిత్రానికి ఒకేలా ఉంటుంది. నాకు మాత్రం ఫలానా కథ నాకు ఎక్సైటింగ్‌గా ఉందా లేదా అన్నది ముఖ్యం. ఎందుకంటే నేను రాబోయే 2-3 సంవత్సరాలు జీవించాలనుకునే కథ ఇదే కదా…మేకింగ్. ప్రతి ఒక్కరినీ దానిలో నిమగ్నమై, దాని గురించి ఉత్సాహంగా ఉంచుతుంది అంటే అప్పుడు వాణిజ్య అంశాలు చోటు చేసుకుంటాయి. ఇది పూర్తి కల్పిత కథ, కానీ నిజమైన పాత్రల ఆధారంగా రూపొందించబడింది. ఇది భారతీయ సినిమాలో ఎవరూ చేయని ఒక రకమైన ప్రయోగం. ఇందులో నేను నా ప్రపంచ నియమాలను నిర్వచించాను” అంటూ చెప్పుకొచ్చారు.
మరోవైపు సినిమా క్లైమాక్స్ పై క్రేజీ బజ్ విన్పిస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’ హెవీ యాక్షన్-ప్యాక్డ్ క్లైమాక్స్ తో, దాదాపు 40 నిమిషాల రన్-టైమ్ ఉంటుందట. క్లైమాక్స్ పోర్షన్ కోసమే మేకర్స్ దాదాపు 80-90 కోట్లు ఖర్చు చేశారని వినికిడి. అన్ని స్పెల్‌బైండింగ్ యాక్షన్ బ్లాక్‌లు ప్రేక్షకులను థియేటర్‌లలో అద్భుతమైన థ్రిల్లింగ్ రైడ్‌కు తీసుకెళ్తాయని టీమ్ నమ్మకంగా ఉంది. ఇక సినిమా విడుదల కోసం మేకర్స్ రెండు కొత్త తేదీలను బ్లాక్ చేసారు. పాన్ ఇండియా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ హోలీకి మార్చి 18 లేదా ఏప్రిల్ 28న రావచ్చని ప్రకటించారు.
