Instagram Subscription Trend: సబ్స్క్రైబర్లకు మాత్రమే.. ఇలా బరితెగిస్తే ఎలా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్యకాలంలో ఒక దరిద్రమైన ట్రెండ్ మొదలైంది. వాస్తవానికి టాలీవుడ్ సహా ఇతర భాషల్లో హీరోయిన్లుగా ఎదుగుదామని వచ్చి, చాలామంది సీరియల్స్ చేస్తూ, టీవీ షోలు చేస్తూ, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లుగా మారుతున్నారు. అయితే అక్కడి వరకు బానే ఉంది, కానీ పక్క సంపాదన కోసం ఇప్పుడు అడ్డదారులు తొక్కుతున్న తీరు షాక్ కలిగిస్తోంది. నిజానికి ఈ మధ్యకాలంలోనే ఇన్స్టాగ్రామ్ ‘సబ్స్క్రైబర్స్’ అనే కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. దాని ప్రకారం ఒక్కొక్క ఇన్ఫ్లుయెన్సర్ లేదా నటి ఒక ఫిక్స్డ్ అమౌంట్ పెట్టి, ఆ అమౌంట్ పే చేసిన వాళ్ళకి ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ షేర్ చేసే అవకాశం కల్పించింది. ఈ అవకాశాన్ని కల్పించిన దగ్గర నుంచి చాలామంది స్కిన్ షో చేస్తూ, దాన్ని ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ అంటూ సదరు సబ్స్క్రైబర్లకు మాత్రమే చూపిస్తున్నారు.
Also Read :Tollywood : టాలీవుడ్ హీరో తండ్రి సినీ రంగ ప్రవేశం
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
అయితే కొంతమంది దీన్ని ప్రొడక్టివ్ గా యూస్ చేస్తున్నా, చాలావరకు మాత్రం స్కిన్ షో ఎక్కువ చేస్తున్న ఫోటోలను, రీల్స్ ను మాత్రమే సబ్స్క్రైబర్స్ కోసం వదులుతూ వెళ్తున్నారు. నిజానికి ఇది చాలా దరిద్రమైన ట్రెండ్ మాత్రమే కాదు, ఫ్యూచర్ లో చాలా ఇబ్బందులు తెచ్చి పెట్టే ట్రెండ్ కూడా అని చెప్పక తప్పదు. ఎందుకంటే ఆ సబ్స్క్రైబర్లలో ఎవరో ఒకరు ఆ ఫోటోలను లేదా వీడియోలను రకరకాల మోడరన్ టెక్నిక్స్ వాడి ట్విట్టర్ (X) వంటి సామాజిక మాధ్యమాల్లోకి తీసుకొస్తున్నారు.
దీనివల్ల వారి కంటెంట్ పైరసీ అవ్వడమే కాదు, కేవలం సబ్స్క్రైబర్స్ కి మాత్రమే చేస్తున్నాం అనుకున్న స్కిన్ షో ప్రపంచమంతా తేటతెల్లమవుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఈ ట్రెండ్ కి స్వస్తి చెప్పి, నిజమైన టాలెంట్ తో అవకాశాలు దక్కించుకుంటే మంచిది. ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే, నెలకు 300 నుంచి 400 రూపాయల వరకు వెచ్చించి చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లకు సబ్స్క్రైబర్లుగా మారుతున్నారు. దీనివల్ల యువత మనీ వేస్ట్ అవ్వడమే కాదు, ఒక్కొక్క ఇన్ఫ్లుయెన్సర్ కి ఐదు నుంచి పది లక్షల వరకు ఆదాయం కూడా తెచ్చిపెడుతున్నారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!