NTV Telugu Site icon

Gabbar Singh: ఏం వార్త చెప్పావ్ బండ్లన్న… పవర్ స్టార్ రేంజ్ ఏంటో చూపిచండి!

Gabbar Singh

Gabbar Singh

ప్రస్తుతం టాలీవుడ్‌లో రీ రిలీజ్ ట్రెండ్ ఓ రేంజ్‌లో నడుస్తోంది. కొత్త సినిమాల రికార్డులు పక్కకు పెట్టి… రీ రిలీజ్ సినిమాల రికార్డులతో కొట్టుకుంటున్నారు స్టార్ హీరోల అభిమానులు. మఖ్యంగా మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రీ రిలీజ్‌తో రచ్చ చేస్తున్నారు. ఇప్పటికే ఖుషి, జల్సా, పోకిరి సినిమాలతో రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ ఇచ్చారు. ఇక ఆగష్టు 9న మహేష్ బర్త్ డే సందర్భంగా బిజినెస్‌ మేన్ రీ రిలీజ్‌తో థియేటర్ టాపులు లేచిపోయేలా ఎంజాయ్ చేస్తున్నారు ఘట్టమనేని ఫ్యాన్స్. ఈ సినిమా జస్ట్ అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే కోటి రూపాయలు కొల్లగొట్టింది. ఖచ్చితంగా రీ రిలీజ్ సినిమాల్లో బిజినెస్ మేన్ సరికొత్త రికార్డులు రాయడం గ్యారెంటీ అంటున్నారు. ఇక ఇప్పుడు అంతకు మించి అనేలా.. గబ్బర్ సింగ్‌ను రీ రిలీజ్ చేస్తామని బండ్లగణేష్ పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పాడు. సెప్టెంబర్ 2 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే ఉంది.

 

ఈ సందర్భంగా పవర్ స్టార్ ఏ సినిమాను రీ రిలీజ్ చేస్తారాని అడగ్గా… సెప్టెంబర్ 2న పవర్ స్టార్ రేంజ్ ఏంటో, పవర్ స్టార్ స్టామినా యేంటో గబ్బర్ సింగ్ ద్వారా మరోసారి చూపిస్తాం అని ట్వీట్ చేశాడు బండ్ల గణేష్. దీనికి డైరెక్టర్ హరీష్ శంకర్… ఏం వార్త చెప్పారన్నా, అలాగే చేద్దామని రిప్లే ఇచ్చాడు. హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన గబ్బర్ సింగ్ 2012లో రిలీజ్ అయి, బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. ఒక అభిమానిగా పవర్ స్టార్‌ను ఏ రేంజ్‌లో చూపించాలో గబ్బర్ సింగ్ సినిమాతో చూపించాడు హరీష్ శంకర్. ఇక ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్‌తో ఆ మ్యాజిక్ చేసేందుకు రెడీ అవుతన్నాడు. అందుకే గబ్బర్ సింగ్ రిలీజ్ అయి 11 ఏళ్లు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా… ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ రిలీజ్ చేశాడు. ఈ గ్లింప్స్‌ కూడా హరీష్ మార్క్‌ టచ్‌తో అదిరిపోయింది. మరి గబ్బర్ సింగ్ రీరిలీజ్, పవన్ ‘ఖుషి’ రీ రిలీజ్ రికార్డులను బ్రేక్ చేస్తుందేమో చూడాలి.