NTV Telugu Site icon

Indraja Shankar: పెళ్లి పీటలు ఎక్కనున్న బిగిల్ గుండమ్మ.. డైరెక్టర్ ను ప్రేమించి.. ?

Bigil

Bigil

Indraja Shankar: కోలీవుడ్ స్టార్ కమెడియన్ రోబో శంకర్ ఇంట పెళ్లి భాజాలు మోగాయి. ఆయన కుమార్తె ఇంద్రజ శంకర్ నిశ్చితార్థం ఫిబ్రవరి 2న గ్రాండ్ గా జరిగింది. ఇంద్రజ కూడా నటినే. తండ్రిలానే ఆమె కుండా లేడీ కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా తమిళ్ మూవీ బిగిల్ లో గుండమ్మగా ఆమె ఎంతో ఫేమస్ అయ్యింది. ఇక పాగల్ సినిమాలో విశ్వక్ ప్రేమలో పడే అమ్మాయిగా కూడా ఇంద్రజ కనిపించి మెప్పించింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఇంద్రజకు డైరెక్టర్‌ కార్తీక్‌తో నిశ్చితార్థం జరిగింది. అయితే వీరిది ప్రేమ వివాహమని కొందరు అంటుండగా .. మరికొందరు పెద్దలు కుదిర్చిన వివాహమని చెప్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ జంట వివాహం మరో నెలలో జరగనుందని తెలుస్తోంది. చెన్నైలో వీరి వివాహాం గ్రాండ్ గా జరగనుందని సమాచారం. ఈ పెళ్ళికి కోలీవుడ్ సెలబ్రిటీలు అందరు హాజరుకానున్నారని సమాచారం.

ఇక రోబో శంకర్ గురించి తెలుగువారికి కూడా తెల్సిందే. మిమిక్రీ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన శంకర్ రోబో డ్యాన్స్ ద్వారా రోబో శంకర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇక ఇదర్కుతనే ఆశైపట్టై బాలకుమార అనే సినిమాలో రోబో శంకర్ కు గుర్తింపు వచ్చింది. ఈ సినిమా తరువాత రోబో శంకర్ స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పిస్తున్నాడు. అంతేకాకుండా రోబో షాంక్స్.. ఒక్కసారిగా బరువు తగ్గి అప్పట్లో హాట్ టాపిక్ గా మారాడు.