దర్శక ధీరుడు రాజమౌళిని ఎప్పుడు ఎవరు కదిలించినా “నాకు ఇండియానా జోన్స్ లాంటి సినిమాలు ఇష్టం, అలాంటి అడ్వెంచర్ సినిమాలు చేయలనిపిస్తూ ఉంటుంది. మహేశ్ బాబుతో నేను చేయబోయే సినిమా ఇండియానా జోన్స్ స్టైల్ లో ఉంటుంది” అని చెప్తూ ఉంటాడు. ఆయన మాటల్లో ‘ఇండియానా జోన్స్’ వినిపించే అంతగా మరే సినిమా పేరు వినిపించదు. అంతలా జక్కన్నని మెప్పించిన ‘ఇండియానా జోన్స్’ సినిమాలో ఏముంటుంది అనేది తెలియాలి అంటే 2023 జూన్ 30న థియేటర్స్ కి వెళ్లాల్సిందే.
డాక్టర్ హెన్రీ వాల్టన్ అనే ఫిక్షనల్ ఆర్కియాలజీ ప్రొఫెసర్ చేసే అడ్వెంచర్స్ ని చూపించే సినిమా ‘ఇండియానా జోన్స్’. ఈ అడ్వెంచర్ డ్రామాలో టైటిల్ రోల్ ని ‘హర్రిసన్ ఫోర్డ్’ ప్లే చేస్తున్నాడు. వరల్డ్స్ గ్రేటెస్ట్ డైరెక్టర్స్ లో ఒకరైన ‘స్టీఫెన్ స్పీల్ బర్గ్’ రూపొందించిన ఈ అమెరికన్ ఫ్రాంచైజ్ లో ఇప్పటివరకూ నాలుగు సినిమా వచ్చాయి. మొదటిది ‘రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్’ అనే పేరుతో 1981 జూన్ 12న రిలీజ్ అయ్యింది. సెకండ్ సినిమా ‘ఇండియానా జోన్స్ అండ్ ది టెంపుల్ ఆఫ్ డూమ్’ 1984 మే 23న ప్రేక్షకుల ముందుకి వచ్చింది. రెండో సినిమా వచ్చిన అయిదేళ్లకి మూడో సినిమా ‘ఇండియానా జోన్స్ అండ్ ది లాస్ట్ క్రూసేడ్’ 1989 మే 24న విడుదలయ్యింది. అప్పట్లో మూడో సినిమాతోనే ‘ఇండియానా జోన్స్’ ఎండ్ అయిపోయిందని అంతా అనుకున్నారు.
మళ్లీ 19 ఏళ్ల తర్వాత 2008 మే 22న ‘ఇండియానా జోన్స్ అండ్ ది కింగ్‌డమ్ అఫ్ ది క్రిస్టల్ స్కల్’ పేరుతో నాలుగో సినిమా బయటకి వచ్చింది. ‘ఇండియానా జోన్స్’ ఫ్రాంచైజ్ నుంచి వచ్చిన ఈ నాలుగు సినిమాలు కొన్ని దశాబ్దాలుగా సినీ అభిమానులని ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు ఈ ఫ్రాంచైజ్ నుంచి ఐదో సినిమా ‘ఇండియానా జోన్స్ అండ్ ది డయిల్ ఆఫ్ డెస్టినీ’ పేరుతో జూన్ 30న విడుదల కానుంది. ప్రపంచవ్యాప్తంగా భారి స్థాయిలో రిలీజ్ కానున్న ఈ మూవీ ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. గ్రాండ్ విజువల్స్, స్టన్నింగ్ యాక్షన్స్ ఎపిసోడ్స్ తో ట్రైలర్ అదిరిపోయింది. హర్రిసన్ ఫోర్డ్ ని ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ‘ఇండియానా జోన్స్’ పాత్రలో చూడడం నాస్టాల్జిక్ ఫీలింగ్ కలిగించింది. ఎన్నేళ్ళు అయినా ఈ ఫ్రాంచైజ్ లో ఉండే మ్యాజిక్ పోదు అనే నమ్మకాన్ని ట్రైలర్ తోనే కలిగించడంలో మేకర్స్ సక్సస్ అయ్యారు. అయితే మొదటి నాలుగు సినిమాలని తెరకెక్కించిన ‘స్టీఫెన్ స్పీల్బర్గ్’ ఈ 5వ సినిమాని రూపొందించలేదు. ‘ది వోల్వరేన్’, ‘లోగన్’, ‘ఫోర్డ్ vs ఫెరారీ’ సినిమాలని డైరెక్ట్ చేసిన ‘జేమ్స్ మాన్గోల్డ్’ ఇండియానా జోన్స్ 5వ సినిమాని డైరెక్ట్ చేశాడు. మరి ‘స్పీల్ బర్గ్’ లేకుండా ‘ఇండియానా జోన్స్’ లో ఆ రేంజ్ మ్యాజిక్ ని ఉంటుందా అనేది చూడాలి.