Site icon NTV Telugu

Pawandeep Rajan : ఇండియన్ ఐడల్ విన్నర్ కు యాక్సిడెంట్.. తీవ్ర గాయాలు

Pawandeep

Pawandeep

Pawandeep Rajan :ఇండియన్ ఐడల్-12 విన్నర్ పవన్ దీప్ రాజన్ కు భారీ యాక్సిడెంట్ అయింది. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరాడు. మూడేళ్ల క్రితం తన మధురమైన పాటలతో ఇండియన్ ఐడల్-12 విన్నర్ గా నిలిచాడు. ఉత్తరాఖండ్ కు చెందిన ఈ పవన్ దీప్ రాజన్.. ఈ రోజు తెల్లవారు జామున 3గంటల ప్రాంతంలో తన కారులో నేషనల్ హైవే-9పై ప్రయాణించాడు. ఆ టైమ్ లో తన ముందు వెళ్తున్న ట్రక్కును ఢీకొట్టడంతో కారు నుజ్జయిపోయింది. ఇందులో ఉన్న పవన్ దీప్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. అతను అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే అతన్ని స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు.

Read Also : Ambati Rambabu: సీమరాజా, కిర్రాక్ ఆర్పీలపై అంబటి రాంబాబు ఫిర్యాదు

అయితే గాయాలు ఎక్కువగా ఉండటంతో అతన్ని వెంటనే నోయిడాలోని ఫోర్టిస్ హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం అచేతన స్థితిలో ఉన్న పవన్ దీప్ కు డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. అతని బాడీలో చాలా చోట్ల ఫ్యాక్చర్ అయినట్టు డాక్టర్లు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అతను త్వరగా కోలుకోవాలంటూ కామెంట్లు పెడుతున్నారు అతని అభిమానులు.
Read Also : Ram Charan : ‘పెద్ది’ ఫస్ట్ షాట్ ను వాడేసిన ఢిల్లీ టీమ్.. చరణ్‌ ఏమన్నాడంటే..?

Exit mobile version