ఇండియా సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా జపాన్ ఆడియన్స్ మన సినిమాలు, హీరోలపై చూపించే లవ్ అండ్ ఎఫెక్షన్ సంథింగ్ డిఫరెంట్. ఈ క్రేజ్‌నే మన మేకర్స్ క్యాష్ చేసుకుంటున్నారు. ఇక్కడ హిట్టైన సినిమాలను అక్కడ డబ్ చేసి మిలియన్స్ గడిస్తున్నారు. భారతీయ సినిమాలకు జపాన్‌లో క్రేజ్ తెచ్చిన మొదటి హీరోగా సూపర్ స్టార్ రజనీకాంత్‌కే క్రెడిట్ దక్కుతుంది. రజనీ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ముత్తు’ 1998లో జపాన్‌లో డబ్ అయ్యి ఘన విజయం సాధించింది. ఈ సినిమాను కొట్టిన సినిమా రాలేదు అనుకుంటే త్రిబుల్ ఆర్‌తో బీట్ చేశాడు జక్కన్న. జపాన్‌లో ముత్తు 23.5 కోట్లు కొల్లగొట్టగా త్రిబుల్ ఆర్ రూ. 24 కోట్లను వసూలు చేసింది.
ఈ మధ్య కాలంలో కల్కి2898ఏడీ, దేవర, సలార్, పుష్ప2 చిత్రాలు కూడా జపాన్ ఆడియన్స్‌ను పలకరించాయి కానీ త్రిబుల్ ఆర్ కలెక్షన్స్ బీట్ చేయలేకపోయాయి. త్వరలో టూ బ్లాక్ బస్టర్స్ జపాన్ ప్రేక్షకుల ముందుకు వెళ్లబోతున్నాయి. అందులో ఒకటి ఆదిత్య ధర్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ ధురంధర్ పార్ట్ వన్. ఇక్కడ రూ. 1300 కోట్లు కొల్లగొట్టిన ఈ స్పైథ్రిల్లర్ జులై 10న అక్కడ థియేటర్స్‌లో సందడి చేయబోతుంది. టాలీవుడ్ హీరో తేజ సజ్జా కూడా జపాన్ ఆడియన్స్ ముందుకు తన విజువల్ వండర్ మూవీ మిరాయ్ తీసుకెళ్లబోతున్నాడు. ఆగస్ట్ 21న అక్కడ ప్రేక్షకులను పలకరించబోతుంది. ఇక్కడ 150 కోట్లు కలెక్ట్ చేసిన ఈ మూవీ జపాన్‌లో ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి. ధురంధర్2తో ఇండియాలో జక్కన్న రికార్డ్స్ చెరిపేసిన ఆదిత్య ధర్ , ధురంధర్‌తో త్రిబుల్ ఆర్ జపాన్ రికార్డ్ చెరిపేస్తాడేమో లెట్స్ వెయిట్.

