ఈరోజు పాన్ ఇండియా మొత్తంలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ అంటే ఇద్దరి పేర్లు మాత్రమే వినిపిస్తాయి. ఒకటి ప్రశాంత్ నీల్, ఇంకొకటి రాజమౌళి. ఈ ఇద్దరూ ఇండియన్ బాక్సాఫీస్ ని రఫ్ఫాడించారు. బాహుబలి సినిమాతో రాజమౌళి పాన్ ఇండియా మార్కెట్ ని క్రియేట్ చేస్తే, ప్రశాంత్ నీల్ KGF సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ ని దున్నేసాడు. రాజమౌళి తర్వాత అంతటి దర్శకుడు ప్రశాంత్ నీల్ మాత్రమే అనే ఫీలింగ్ ప్రతి ఒక్కరిలో ఉంది. ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రతి సూపర్ స్టార్ ప్రశాంత్ నీల్, రాజమౌళిలతో సినిమా చెయ్యాలి అనుకుంటున్నాడు. అలాంటి టాప్ డైరెక్టర్స్ ఇద్దరూ ఈరోజు కలిసారు. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సెకండ్ ఔటింగ్ ‘ఎన్టీఆర్ 30’ ఈరోజు గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ఈ ఈవెంట్ కి రాజమౌళి, ప్రశాంత్ నీల్ చీఫ్ గెస్టులుగా వచ్చారు. ఈ లాంచ్ ఈవెంట్ లో రాజమౌళి, ప్రశాంత్ నీల్ కలిసి ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పాన్ ఇండియా డైరెక్టర్స్ అంటూ, మోస్ట్ డేంజరస్ డైరెక్టర్స్ అంటూ, వీళ్లని మించిన దర్శకులని చూపిస్తే లైఫ్ టైమ్ సెటిల్మెంట్ అంటూ… ఇలా రకరకాల కాంప్లిమెంట్స్ ఇస్తూ రాజమౌళి, ప్రశాంత్ నీల్ ఉన్న ఫోటోలని వైరల్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ కి పాన్ ఇండియా ఇమేజ్ రావడానికి ముఖ్యకారణం రాజమౌళినే. KGF పార్ట్ 1 సినిమాని ఎవరూ నమ్మక ముందు, అందరికన్నా ముందు జక్కన KGF రషెస్ చూసి ప్రశాంత్ నీల్ ని, KGF సినిమాని ప్రమోట్ చేశాడు. ఆ తర్వాత KGF 2 సినిమాతో ప్రశాంత్ నీల్, రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ రికార్డులనే బ్రేక్ చేసి పాన్ ఇండియా ఆడియన్స్ కి షాక్ ఇచ్చాడు. హ్యూమన్ ఎమోషన్స్ ని లార్జ్ స్కేల్ సినిమాలో కూడా పెర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చెయ్యగల రాజమౌళి, ప్రశాంత్ నీల్ లాంటి దర్శకులు ఇండియన్ సినిమాని మరింత ముందుకి తీసుకోని వెళ్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
