NTV Telugu Site icon

Arman Malik: అల్లు అర్జున్ కి పాడేసాను… మహేష్ బాబుకి బాలన్స్ ఉంది…

Arman Malik

Arman Malik

అర్మాన్ మాలిక్… దాదాపు పదమూడు ఇండియన్ భాషల్లో పాటల్లో పాడిన టాప్ సింగర్. ఇప్పటివరకూ 45కి పైగా తెలుగు పాటలని పాడిన అర్మాన్ మాలిక్ కి వరల్డ్ వైడ్ ఫాన్స్ ఉన్నారు. రక్త చరిత్ర 2 సినిమా నుంచి మొదలైన అర్మాన్ మాలిక్ తెలుగు పాటల ప్రస్థానం, వరుణ్ తేజ్ తొలిప్రేమ సినిమాలోని ‘నిన్నిలా నిన్నిలా’ సాంగ్ తో మంచి ఊపందుకుంది. అక్కడి నుంచి బ్యాక్ టు బ్యాక్ తెలుగు సాంగ్స్ ని పాడుతున్న అర్మాన్ మాలిక్, ‘బుట్టబొమ్మ’ సాంగ్ తో స్టార్ డమ్ అందుకున్నాడు. ప్రస్తుతం కెరీర్ బెస్ట్ ఫేజ్ ని ఎంజాయ్ చేస్తున్న అర్మాన్ మాలిక్ హైదరాబాద్ లో మ్యూజిక్ కాన్సర్ట్ కి రెడీ అయ్యాడు. ఈరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి పది గంటల వరకూ ఎల్బీ స్టేడియంలో అర్మాన్ మాలిక్ మ్యూజికల్ కాన్సర్ట్ జరగనుంది. హైదరాబాద్‌లో విద్యార్థులచే నిర్వహించబడుతున్న అతిపెద్ద NGO ‘స్ట్రీట్ కాజ్’ కోసం అర్మాన్ మాలిక్ మరియు ‘బ్యాండ్ కాప్రిసియో’లు లైవ్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు.

ఈ సంధర్భంగా అర్మాన్ మాలిక్ తో ఎన్టీవీ స్పెషల్ చిట్ చాట్ చేసింది. “తెలుగులో పాటలు పాడడం చాలా స్పెషల్ గా ఉంటుంది. ఇప్పటివరకూ ఎన్నో పాటలు పాడాను కానీ రాజమౌళి సినిమాలో పాడే అవకాశం కోసం వెయిట్ చేస్తున్నాను. అలానే ఆల్మోస్ట్ అందరు హీరోల సినిమాల్లో పాటలు పాడాను కానీ మహేష్ బాబు సినిమాలో ఇప్పటివరకూ పాడలేదు. ఫ్యూచర్ సినిమాల్లో ఆ ఛాన్స్ వస్తే మహేష్ బాబుకి పాట పాడాలని ఉంది. ఇండియన్ మ్యూజిక్ ని ఇంటర్నేషనల్ లెవల్ కి తీసుకోని వెళ్లాలి” అని అర్మాన్ మాలిక్ మాట్లాడాడు. ఈ స్పెషల్ చిట్ చాట్ లో బుట్టబొమ్మ సాంగ్ ని కూడా అర్మాన్ మాలిక్ ఎన్టీవీ వ్యూవర్స్ కోసం పాడడం విశేషం.