Site icon NTV Telugu

Mrunal Thakur: ఆ అవకాశాలు ఇచ్చే అంత పాపులర్ కాదు నేను…

Mrunal

Mrunal

మృణాల్ ఠాకూర్… సీతారామం సినిమాతో తెలుగు తెరపై మెరిసిన ఈ మహారాష్ట్ర బ్యూటీ, మొదటి సినిమాతోనే మ్యాజిక్ క్రియేట్ చేసింది. హోమ్లీ లుక్స్ అండ్ యాక్టింగ్ స్కిల్స్ తో పర్ఫెక్ట్ బాలన్స్ లో ఉండే మృణాల్… ఇటీవలే నానితో హాయ్ నాన్న సినిమా చేసింది. ఈ సినిమాలో… నానితో పోటీ అద్భుతంగా నటించి మెప్పించింది మృణాల్. మృణాల్ యాక్టింగ్ తో ఎమోషనల్ సీన్స్ లో ఏడిపించేసింది. ముఖ్యంగా క్లైమాక్స్ లో మృణాల్ చేసిన పర్ఫార్మెన్స్ మరికొన్ని రోజులు పాటు గుర్తు పెట్టుకుంటారు. కెరీర్ ని ఇలానే ముందుకి తీసుకోని వెళ్తే మృణాల్ కి తెలుగులో లాంగ్ కెరీర్ ఉంటుంది. హాయ్ నాన్న సినిమాలో కంప్లీట్ స్టాండ్ అవుట్ గా నిలిచిన మృణాల్ ఠాకూర్… ప్రేమ కథలకి పర్ఫెక్ట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. అయితే హిందీలో మాత్రం తనకి ప్రేమకథలు రావట్లేదని రివీల్ చేసింది.

“నేను బాలీవుడ్ లో అంత ఫేమస్ కాదేమో, అందుకే నాకు ప్రేమకథలు రావట్లేదు” అంటూ మృణాల్ ఇటీవలే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ప్రేమకథలు బాలీవుడ్ లో కూడా వస్తే బాగుంటుంది అని చెప్పిన మృణాల్… ఎవరిని ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియదు అందుకే ఇంటర్వ్యూ ద్వారా తెలియజేస్తున్నాను అనింది. ఈ క్లిప్ వైరల్ అవ్వడంతో టాలీవుడ్ లో మెయిన్ కెరీర్ సెట్ చేసుకోని, మంచి అవకాశం వచ్చినప్పుడు మాత్రమే హిందీలో నటించమని సలహాలు ఇస్తూ మృణాల్ తెలుగు ఫ్యాన్స్. ఈ విషయాన్ని కన్సిడర్ చేసి మృణాల్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీపైన ఎక్కువ దృష్టి పెడుతుందా లేక అందరిలాగే తెలుగు నుంచి నార్త్ లో అవకాశాల కోసం ఇక్కడ సినిమాలు తగ్గిస్తుందా అనేది చూడాలి.

Exit mobile version