రవితేజ ప్రస్తుతం పలు చిత్రాల్లో బిజీగా ఉన్నాడు. వాటిలో ఒకటి “ఖిలాడీ”. యాక్షన్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందుతోంది. రవితేజ నటిస్తున్న మరో చిత్రం “రామారావు ఆన్ డ్యూటీ”. “రామారావు ఆన్ డ్యూటీ” నిజమైన సంఘటనల నుండి ప్రేరణ పొందిన థ్రిల్లర్. సామ్ సిఎస్ సంగీతం అందిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా షూటింగ్ కొంతవరకు పూర్తయ్యింది. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో గోవా బ్యూటీ కన్పించబోతోందట. సమాచారం ప్రకారం ఒక ప్రత్యేక పాట కోసం “ఖిలాడీ” మేకర్స్ ఇలియానాను సంప్రదించారు. “కిక్”, “అమర్ అక్బర్ ఆంటోనీ”లలో రవితేజతో జత కట్టిన ఇలియానా ఐటమ్ పాట చేయడానికి వెంటనే అంగీకరించింది అని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సాంగ్ ఫైనాన్సియల్ అంశాల గురించి చర్చలు జరుగుతున్నాయట.
Read Also : “పుష్ప” వీడియో లీక్… పోలీసులను ఆశ్రయించిన మైత్రి నిర్మాతలు
ప్రస్తుతం ఇలియానా చేతిలో ఆఫర్లు ఏం లేవు. అందుకే మన ఇల్లీ బేబీ స్పెషల్ సాంగ్ కు పచ్చ జెండా ఊపింది అంటున్నారు. గత కొంతకాలంగా పూర్తిగా సినిమాలకు దూరమైన ఇలియానా తనకు స్టార్ డమ్ ఇచ్చిన తెలుగు సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉందని అంటున్నారు. ఈ మేరకు ఇలియానాతో తెలుగు దర్శకనిర్మాతల చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరి “రామారావు” ఆమెకు మునుపటి ఎనర్జీ ఇస్తాడేమో చూడాలి.
