NTV Telugu Site icon

Ileana: ఇలియానా బిడ్డకు తండ్రి ఎవరో తెలిసిపోయింది..?

Illlu

Illlu

Ileana: గోవా బ్యూటీ ఇలియానా ప్రస్తుతం ప్రెగ్నెంట్ గా ఉన్న విషయం తెల్సిందే. అయితే పెళ్లి ముందే ఆమె గర్భం దాల్చడంతో.. ఆ బిడ్డకు తండ్రి ఎవరు ..? అని ప్రతి ఒక్కరు ఇలియానాను అడుగుతున్నారు. అయితే వాటిని ఏ మాత్రం పట్టించుకోని ఇలియానా.. బేబీ బంప్ తో ఫోటోలకు ఫోజులిస్తూ.. తల్లి ప్రేమను ఆస్వాదిస్తోంది. నిత్యం సోషల్ మీడియాలో వరుస ఫోటోలను షేర్ చేస్తున్న ఈ చిన్నది.. తాజాగా తన బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేసింది. ఎట్టకేలకు తన బిడ్డకు తండ్రిని ప్రపంచానికి చూపించడానికి రెడీ అయ్యింది. సముద్రపు ఒడ్డున వెకేషన్ ను ఎంజాయ్ చేస్తున్న ఫోటోలతో పాటు ఎంగేజ్ మెంట్ రింగ్ ఉన్న చేతులను కూడా చూపించింది.

Honey Rose : నా బాడీ షేప్ గురించి వాడు నోటికి వచ్చినట్లు వాగుతుంటే.. నవ్వారు

ఇక దీంతో వీరి ఎంగేజ్ మెంట్ అయిపోయింది అని కొందరు అంటుండగా.. పెళ్లి కూడా చేసుకొని ఉంటారు అని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు. అయితే ముఖం చూపించకపోవడం, కనీసం పేరు కూడా మెన్షన్ చేయకపోవడంతోఅభిమానులు ఒకింత నిరాశకు గురయ్యారు. ఏదిఏమైనా ఇల్లూ బేబీకి పెళ్లి అయితే కాబోతుంది.. అంతకు మించిన ఆనందం ఏముంది అని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఇలియానా ఇప్పుడు ఈ ఫోటో షేర్ చేసింది అంటే .. త్వరలోనే తన బిడ్డకు తండ్రి ఎవరో ఖచ్చితంగా చెప్పేస్తోంది అని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు. మరి ఈ గోవా బ్యూటీని దక్కించుకున్న ఆ అదృష్టవంతుడు ఎవరో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.