NTV Telugu Site icon

Ileana : పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన గోవా బ్యూటీ..

Whatsapp Image 2023 08 06 At 8.54.42 Am

Whatsapp Image 2023 08 06 At 8.54.42 Am

స్టార్ హీరోయిన్ ఇలియానా తన అభిమానుల కు అదిరిపోయే శుభవార్త అందించారు. తాను పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్టు వెల్లడించారు.సోషల్ మీడియా వేదిక గా ఈ విషయాన్ని వెల్లడించింది ఇలియానా.తన కొడుకు ఫోటోను షేర్ చేయడం తో పాటు తన కొడుకు పేరును కూడా అభిమానులకు వెల్లడించడం విశేషం.. ఇలియానా చెప్పిన శుభవార్త అభిమానులకు ఎంతో ఆనందాన్ని కలిగించింది..ఆగష్టు నెల 1 వ తేదీ న తాను మగబిడ్డ కు జన్మనిచ్చా ను అని ఆమె పేర్కొన్నారు. తన కొడుకు కు “కోవా ఫీనిక్స్ డోలన్” అని పేరును కూడా పెట్టింది ఈ గోవా బ్యూటీ. నా కొడుకును ఈ ప్రపంచానికి పరిచయం చేస్తున్నందుకు నాకు కలిగే ఈ సంతోషాన్ని మాటల్లో చెప్పలేనని ఇలియానా తెలిపారు.. ఈ విషయం తెలిసిన అభిమానులు ఇలియానా కొడుకు ఎంతో క్యూట్ గా ఉన్నాడని అచ్చం తల్లి పోలికలతో పుట్టాడని సోషల్ మీడియా లో కామెంట్స్ కూడా చేస్తున్నారు.

తనకు కొడుకు పుట్టడం తో తన మనస్సు సంతోషంతో నిండిపోయిందని ఆమె చెప్పుకొచ్చారు. అయితే బిడ్డ కు జన్మనిచ్చిన ఇలియానా తన పెళ్లి గురించి కానీ కొడుకుకు సంబంధించిన ఇతర విషయాల గురించి మాత్రం వెల్లడించలేదు.ప్రస్తుతం ఇలియానా వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదిక గా బాగా వైరల్ అవుతున్నాయి.గత నెల లో తన ప్రియుడి ఫోటోలను షేర్ చేసిన ఇలియానా అతనికి సంబంధించిన ఇతర విషయాల ను మాత్రం తెలియజేయలేదు.. త్వరలో ఇలియానా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి మరిన్ని కీలక విషయాలను రివీల్ చేస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. మరోవైపు ఈ గోవా బ్యూటీకి సినిమా ఆఫర్లు తగ్గాయి.ఈ భామ మళ్ళీ హీరోయిన్ గా మరింత బిజీ కావాలని ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు. మరి ఇలియానా మళ్ళీ సినిమాల లో తిరిగి హీరోయిన్ గా బిజీ అవుతుందో లేదో చూడాలి.

Show comments