Ileana Ban: అసలే అవకాశాలు లేవు.. ఇంకా ఎందుకురా పాపను ఏడిపిస్తారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కోటి రూపాయల రెమ్యునరేషన్ అందుకున్న ఫస్ట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది ‘ఇలియానా’. హీరో ఎవరు అనే ప్రశ్నతో సంబంధం లేకుండా ఇలియానా అందాలని చూడడానికి థియేటర్స్ కి వెళ్లే ఫాన్స్ ఆమె సొంతం. గ్లామర్ క్వీన్ గా యూత్ హార్ట్స్ ని కొన్నేళ్ల పాటు రూల్ చేసిన ఇలియానా ఇప్పుడు సైలెంట్ అయిపొయింది. సౌత్ లో ఉన్న స్టార్ హీరోయిన్ ఇమేజ్ ని వదిలేసి ఇలియానా బాలీవుడ్ పై మనసు పారేసుకోని నార్త్ వెళ్లిపోయింది. అక్కడ ఆశించిన స్థాయిలో సినిమాలు రాలేదు, ఇక్కడ ఉన్న స్టార్ హీరోయిన్ ఇమేజ్ పోయింది. దీంతో ఇలియానా అటు సౌత్ కి ఇటు నార్త్ కి కాకుండా అయిపొయింది. దీంతో సినిమాలు చెయ్యకుండా సోషల్ మీడియాలో హాట్ ఫోటోస్ ని పోస్ట్ చెయ్యడానికి పరిమితం అయ్యింది ఇలియానా. ఇన్స్టా, ట్విట్టర్ లో చాలా యాక్టివ్ గా గ్లామర్ షో చేస్తున్న ఇలియానా గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.
Read Also: Ileana D’cruz: ఇంత అందానికి ఎవ్వరైనా ‘దేవదాస్’ లు కావాల్సిందే
Also Read
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
- Jim Jim Thara: జిమ్ జిమ్ తార.. నమ్మేలా ఉందా బాల?
ఇలియానా పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడానికి కారణం ఆమె లేటెస్ట్ గా పోస్ట్ చేసిన బికినీ ఫోటోస్ కారణం కాదు, తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఇలియానాని బాన్ చేసింది అనే వార్త ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది. ఈ కారణంగానే ఇలియానా ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే ఇలియానా ఒక తమిళ ప్రొడ్యూసర్ నుంచి ఒక ప్రాజెక్ట్ నిమిత్తం భారీ మొత్తంలో అడ్వాన్స్‌గా తీసుకుని షూటింగ్‌కి నిరాకరించడంతో సదరు నిర్మాత TFPC(తమిళ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్)కి ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదుతో తమిళ చిత్ర నిర్మాతలు ఇలియానాని ఎలాంటి తమిళ సినిమాలకు సైన్ చేయకూడదని నిర్ణయం తీసుకున్నారు అనే మాట సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఈ రూమర్స్ ని నిరాధారమైనవిగా పేర్కొంటూ, TFPC ఇలియానాపై అటువంటి నిషేధాన్ని విధించలేదని క్లారిటీ ఇచ్చింది. ఇలియానా చాలా కాలంగా తమిళం మరియు తెలుగు సినిమాలకు దూరంగా ఉండటం వల్ల సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి ఇలియానా నిషేధించబడుతుందనే రూమర్స్ వినిపిస్తున్నాయి కానీ వాటిలో నిజం లేదు. ఇలియానా బాన్ అనేది రూమర్ మాత్రమే అని తెలుసుకున్న ఆమె ఫాన్స్… అసలే అవకాశాలు లేవు, ఇంకా ఎందుకురా మా పాపను ఏడిపిస్తారు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
-
Farmer Loan: రైతన్నలకు అలర్ట్.. 4 శాతం వడ్డీ రేటుతో రూ.5 లక్షల వరకు లోన్..
-
TGBIE : సర్కారీ కాలేజీల్లో బిగ్ చేంజ్.. ఇంటర్ బోర్డు కీలక నిర్ణయాలు
-
CM Revanth Reddy : ఇది కాంగ్రెస్ సమస్య కాదు.. దేశ ప్రజల సమస్య
-
Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!