Site icon NTV Telugu

AR Rahman : దుబాయ్ స్టూడియోలో ఇళయరాజా

ARR-and-Ilayaraja

మ్యూజిక్ దిగ్గజాలు ఏఆర్ రెహమాన్, ఇసైజ్ఞాని ఇళయరాజా తాజాగా దుబాయ్‌లో ఒకరినొకరు కలుసుకున్నారు. ఈ జంట చాలా మంది సంగీతకారులకు హాట్ ఫేవరెట్ అన్న విషయం తెలిసిందే. వివరాల్లోకి వెళ్తే… దుబాయ్ లో ఉన్న మాస్ట్రో రెహమాన్ స్టూడియో ఫిర్దౌస్ ని ఆదివారం ఇళయరాజా సందర్శించారు. ఎఆర్ రెహమాన్ ట్విట్టర్‌లో మ్యూజిక్ లెజెండ్‌తో కలిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. “మా ఫిర్దౌస్ స్టూడియోకి మాస్ట్రో ఇళయరాజాను స్వాగతించడం చాలా ఆనందంగా ఉంది… భవిష్యత్తులో మా ఫిర్దౌస్ ఆర్చ్ కోసం ఆయన అద్భుతమైన మ్యూజిక్ కంపోజ్ చేస్తాడని ఆశిస్తున్నాను!” అంటూ ఆ పిక్ ను షేర్ చేశారు.

Read Also : Radhe Shyam Press Meet : లైవ్

ఈ పిక్ వైరల్‌గా మారింది. త్వరలో ఇద్దరూ కలిసి ఒక ప్రాజెక్ట్ కోసం సహకరించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రతిభావంతులైన స్వరకర్తలు ఇద్దరూ దుబాయ్ ఎక్స్‌పో 2022లో పాల్గొన్నారు. అక్కడ లైవ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఏదైతేనేం ఇద్దరు మ్యూజిక్ లెజెండ్స్ ను ఒకే ఫ్రేమ్ లో చూడడం సంతోషంగా ఉందంటున్నారు సంగీత ప్రియులు.

Exit mobile version