ilayaraja : ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా మరోసారి తన భక్తిని చాటుకున్నారు. కర్ణాటకలోని కొల్లూరు మూకాంబిక అమ్మవారి ఆలయాన్ని నేడు ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రూ.4 కోట్ల విలువైన కిరీటాన్ని అమ్మవారికి బహూకరించారు. ఈ కిరీటంలో రకరకాల వజ్రాలు పొదిగి ఉన్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఇళయరాజా. ఆయనకు అమ్మవారి తీర్థ, ప్రసాదాలు అందజేసి.. ఆశీర్వచనం అందించారు పూజారులు.
Read Also : The Rajasab : రాజాసాబ్ లో సర్ ప్రైజ్ ఇవ్వబోతున్న ప్రభాస్..
ఆయన వెంట కొడుకు కార్తీక్ తో పాటు మనవడు ఉన్నారు. అమ్మవారికి తన మొక్కు ఎప్పటి నుంచో ఉండిపోయిందని.. ఆమె తనకు ఇచ్చిన దాంట్లో కొంత తిరిగి ఇచ్చినట్టు తెలిపాడు. ఇళయరాజా సంగీత ప్రపంచాన్ని శాసించిన మ్యూజిక్ డైరెక్టర్. ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న ఆయన.. సంగీతమే శ్వాసగా బతికారు. ఇప్పటికీ ఆయన పాటలు సోషల్ మీడియాను ఊపేస్తూనే ఉంటాయి. తెలుగులో రీసెంట్ గానే ఓ సినిమాకు పనిచేశారు. ఇప్పుడు ఆయన వరుసగా మూడు సినిమాలు చేస్తున్నారు.
Read Also : Hansika : హన్సికకు కోర్టులో షాక్.. ఇలా జరిగిందేంటి..
